గూగుల్‌లో `కుట్ర` అని కొడితే కేటీఆర్‌ను చూపిస్తుంది
ఆంధ్రప్రదేశ్‌కి రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లోక్ సభలో కవిత మాట్లాడిన విషయం తెలిసిందే..!!
గూగుల్ సైట్ లో 'కుట్ర' అని టైప్ చేస్తే కేటీఆర్ పేరు వస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన విధానంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శలు చేస్తుంటే, కేటీఆర్, కవితలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన మండిపడ్డారు. మోదీ వ్యాఖ్యలపై స్పందించకపోవడానికి రహస్య ఒప్పందాలే కారణమన్న శ్రవణ్.. మోదీ ఒప్పందాలపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్‌కి రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లోక్‌సభలో కవిత మాట్లాడిన విషయం తెలిసిందే..!! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా 'సోదరి కవితగారికి ధన్యవాదాలు' అని కూడా చెప్పారు.