ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలకు అనుమతి నిరాకరించిన ఇసి
ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలకు అనుమతి నిరాకరించిన ఇసి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలకు ఎన్నికల కోడ్ అడ్డుగా నిలిచింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో వున్నందున ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఉగాది వేడుకలు నిర్వహించరాదని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనుమతి పొందిన అనంతరం ప్రగతి భవన్ కాకుండా మరెక్కడైనా ఉగాది వేడుకలు జరుపుకోవచ్చని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.