Amit Shah Junior Ntr Meet: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వేళ ఎన్టీఆర్‌తో ఆయన భేటీ పలు ఊహాగానాలకు , చర్చలకు తెరలేపింది. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ఆదివారం (ఆగస్టు 21) రాత్రి 10.30 గం. సమయంలో ఈ ఇద్దరి భేటీ జరిగింది. దాదాపు 50 నిమిషాల పాటు ఈ భేటీ జరగ్గా.. 20 నిమిషాల పాటు ఇద్దరు ఏకాంతంగా చర్చించుకున్నారు. భేటీ సందర్భంగా ఎన్టీఆర్ అమిత్ షాను మర్యాదపూర్వకంగా పుష్ప గుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి సత్కరించారు. భేటీ అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కలిసి ఇద్దరు భోజనం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇద్దరు ఏకాంతంగా ఏం చర్చించారు..?


అమిత్ షా-ఎన్టీఆర్ మధ్య జరిగిన అనూహ్య భేటీ చాలామందిని ఆశ్చర్యపరిచింది. భేటీలో ఈ ఇద్దరు 20ని. పాటు ఇద్దరి మధ్య ఏకాంత చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఏకాంత చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అమిత్ షా సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించినట్లు.. ఆయన సినిమాలు తాను చూశానని ఎన్టీఆర్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అందించిన పాలనను ప్రశంసించినట్లు సమాచారం. 


ఇంతకుమించి ఏ విషయాలు బయటకు రాలేదు. ఇద్దరి మధ్య చర్చ సినిమాలకే పరిమితమైందా.. లేక రాజకీయాంశాలు చర్చకు వచ్చాయా అనేది ఇప్పుడు అసలైన చర్చగా మారింది. ఎన్టీఆర్ కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం, గతంలో ఆయన టీడీపీ తరుపున క్యాంపెయిన్ కూడా చేయడం, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానుల్లో బలమైన కోరిక ఉండటం.. ఇవన్నీ చూస్తే రాజకీయ  వ్యూహంతోనే ఈ భేటీ జరిగిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయి.. ఆయన్ను ప్రత్యక్షంగా కలిసి అభినందించాలని అమిత్ షా భావించారని.. అందుకే ఈ భేటీ జరిగిందనే వాదన కూడా ఉంది. అమిత్ షా ఎన్టీఆర్ నటనను అభినందించాలంటే ఒక్క ట్వీట్ లేదా ఫోన్ కాల్ చాలు. కానీ గంట పాటు ఎన్టీఆర్‌కు సమయమిచ్చి ఆయనతో మాట్లాడారంటే ఇంకేదో ఉందనే చర్చ జోరుగా జరుగుతోంది.


Also Read:Megastar Chiranjeevi Birthday Special: మొగల్తూరు టు ఫిలింనగర్.. స్వయంకృషే పెట్టుబడి!


Also Read: Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్? సీబీఐ ఉచ్చులో కేసీఆర్ ప్యామిలీ.. నెక్స్ట్ టార్గెట్ సారేనా.. ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook