Amit Shah Comments On CM KCR: సీఎం కేసీఆర్ ప్రధాని సీటు గురించి పక్కనపెట్టి.. ముందు సీఎం కూర్చిని కాపాడుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నిర్వహించిన చేవెళ్ల విజయ సంకల్ప సభలో సీఎం కేసీఆర్ లక్ష్యంగా అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని సీటు ఖాళీగా లేదని.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీజేపీనేని అన్నారు. మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోదీనే ఉండబోతున్నాని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని.. ఎంఐఎంకు భయపడే బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినం నిర్వహించట్లేదన్నారు. ఓవైసీ ఎజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం కావాలా..? వద్దా..? అంటూ విజయ సంకల్ప సభలో అమిత్ షా అడిగారు. మీరు చెప్పే సమాధానం ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వినబడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గత 9 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పాలన కొనసాగిస్తోందని.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  
 
ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్ పేపర్ల లీకేజీపై కూడా మాట్లాడారు అమిత్ షా. యువకుల జీవితాలతో సీఎం కేసీఆర్ ఆటలాడుతున్నారని.. పేపర్ల లీకేజీపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెట్టారని ఫైర్ అయ్యారు. పేపర్ల లీకేజీపై నిలదీసిన బండి సంజయ్‌ను జైల్లో పెట్టారని.. కానీ 24 గంటల్లోనే బెయిల్ వచ్చిందన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని.. వారికి సాధ్యం కాలేదన్నారు. జైళ్లకు బీజేపీ కార్యకర్తలు భయపడరని.. బీఆర్ఎస్‌ను గద్దె దించే వరకు విశ్రమించరని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే దొంగలను జైల్లోకి వేస్తామన్నారు. కేసీఆర్‌కు మళ్లీ చెబుతున్నాని.. తమ కార్యకర్తలు జైళ్లకు భయపడరని అన్నారు. పేపర్ల లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 


Also Read: PM Modi Schedule: ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు.. 36 గంటల్లో 5,300 కి.మీ ప్రయాణం  


ఒక్కసారి బీజేపీ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. బీజేపీ అధికారంలోకి వస్తే.. రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ఒకటో తేదీకే జీతాలు చెల్లిస్తామని చెప్పారు. తనను అరెస్ట్ చేసిన పోలీసులు 8 గంటలు రోడ్లపై తిప్పారని.. ఢిల్లీ నుంచి ఫోన్ వస్తే కంగారు పడ్డారని అన్నారు. చేవెళ్ల గడ్డపై పులి అడుగు పెట్టిందని అమిత్‌ షాను ఉద్దేశించి అన్నారు. బీజేపీ తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.


Also Read: IPL 2023 Updates: కేఎల్ రాహుల్‌, డేవిడ్ వార్నర్ ఇదేం బ్యాటింగ్ భయ్యా..! స్ట్రైక్ రేట్ ఏది..?   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి