Karimnagar Hasanparthy Railway Line: ఉత్తర తెలంగాణ వాసులకు శుభవార్త. దశాబ్దాలకు పైగా పెండింగ్‌లో ఉన్న కరీంనగర్–హసన్‌పర్తి కొత్త రైల్వే లేన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా కొత్త రైల్వే లేన్ నిర్మాణానికి సంబంధించి యుద్ద ప్రాతిపదికన రీ సర్వే చేసి నివేదిక సమర్పించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. సర్వే నివేదిక వచ్చిన అనంతరం నిధులు కేటాయింపుతోపాటు రైల్వే లేన్ నిర్మాణ పనులను ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి కరీంనగర్ –హసన్‌పర్తి రైల్వే లేన్ నిర్మాణానికి సంబంధించి వినతిపత్రం అందజేశారు. దీంతోపాటు సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లిలో రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలని.. ఈ మేరకు ఆ ప్రాంతంలో స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరీంనగర్–హసన్‌పర్తి రైల్వే లేన్ నిర్మాణానికి 2013లో సర్వే చేసినా.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ధిష్ట సమయంలోగా సరైన నిర్ణయం తీసుకోని కారణంగా ఎలాంటి పురోగతి లేకుండా పోయిందని బండి సంజయ్ అన్నారు. దాదాపు 62 కి.మీల మేరకు పనులు సాగే ఈ రైల్వే లేన్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ఉత్తర తెలంగాణలోని గ్రానైట్ ఇండస్ట్రీతోపాటు వరి, పప్పు ధాన్యాలు, పసుపు పంట ఉత్పత్తుల రవాణా సులువు కానుందన్నారు.


బండి సంజయ్ విజ్ఝప్తికి సానుకూలంగా స్పదించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారులను పిలిపించుకుని మాట్లాడారు. యుద్ద ప్రాతిపదికన కరీంగనర్-హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణంపై రీ సర్వేను నిర్వహించి నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. రైల్వేశాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా త్వరలో వచ్చే నెలలో ప్రారంభించేందుకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో రైలు ఆగేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 


Also Read: Sandeep Lamichhane: లైంగిక ఆరోపణలు.. జైలుకు వెళ్లొచ్చి చరిత్ర సృష్టించిన నేపాలీ స్పిన్నర్.. రషీద్ ఖాన్ రికార్డు బద్దలు


తన విననంపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రికి బండి సంజయ్ కృతజ్ఞత తెలిపారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కరీంనగర్–హసన్‌పర్తి రైల్వే లేన్ నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే ఈ రైల్వే లేన్ నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయని.. దీనివల్ల ఇంతకాలం ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలు ఇబ్బంది పడ్డారని అన్నారు.


Also Read: Viveka Murder Case Latest Update: డీఎన్‌ఏ టెస్టుకు రెడీ.. అప్పుడే నన్ను పెళ్లి చేసుకున్నారు: వివేకా రెండో భార్య సంచలన స్టేట్‌మెంట్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook