హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించి ఉండుంటే మేయర్ పదవి బీజేపి కైవసం అయ్యుండేది అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి దాదాపు 44 స్థానాల్లో బలహీనపడితే.. అవే స్థానాల్లో బీజేపి బలపడిందని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ భారీగా డబ్బులు పంపిణీ చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయడంతో పాటు భారతీయ జనతా పార్టీపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేసిన నేతలు, కార్యకర్తలు ప్రతీ ఒక్కరికీ కిషన్ రెడ్డి ( G Kishan Reddy ) పేరుపేరునా ధన్యావాదాలు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : MP Arvind Dharmapuri: తెలంగాణలో బీజేపికి 15 లోక్ సభ సీట్లు


ఈ సందర్భంగా తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi Sanjay ) మాట్లాడుతూ.. టీఆర్ఎస్ విజయం కోసం తీవ్ర కృషి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం, డీజీపీకి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నామని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ( GHMC Elections 2020 Results ) టీఆర్ఎస్ అక్రమాలపై బీజేపి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా స్టేట్ ఎలక్షన్ కమిషనర్, డీజీపీ పూర్తిగా అధికార పార్టీకే అండగా నిలిచారని బండి సంజయ్ మండిపడ్డారు.


Also read : ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా.. గ్రేటర్ ఓటమికి నైతిక బాధ్యత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook