Ayodhya Pran Pratishtsha: అయోధ్యలో రామందిరం నిర్మాణం కోసం కృషి చేసిన వారిని కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఈ క్రమంలో పుల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత పుల్లారెడ్డి పాత్రపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రశంసించారు. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట ఉత్సవాన్ని పుల్లారెడ్డికి సంబంధించిన విద్యాలయంలో సోమవారం కిషన్‌ రెడ్డి వీక్షించారు. హైదరాబాద్‌ మోహిదీపట్నంలోని జి.నారాయణమ్మ విద్యాసంస్థలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి పుల్లారెడ్డి, నారాయణమ్మ దంపతులకు నివాళులర్పింఆరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కార్యక్రమంలో కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. 'భారతదేశంపై దాడిచేసిన మొగల్ రాజు.. బాబర్ అయోధ్యలోని రామమందిరాన్ని ధ్వంసం చేశాడు. 500 ఏండ్ల సుదీర్ఘ పోరాటాల తర్వాత మళ్లీ అయోధ్యలో రామమందిరాన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది. అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని అరబ్, యూరోప్, ఆఫ్రికన్, అమెరికా దేశాలతో పాటు అన్ని దేశాల్లోనూ వర్చువల్ గా వీక్షిస్తున్నారు' అని తెలిపారు.


మన దేశంలో రాముడి పూజ జరగని గ్రామం లేదని, భారతదేశం అంతా రామమయం.. జగమంతా రామమయంగా మారిందని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. 20 రోజులుగా ఏ విద్యాసంస్థకు వెళ్లినా, గ్రామానికి వెళ్లినా రామమందిరంపైనే చర్చ ఉందని తెలిపారు. ఆన్‌లైన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత  ప్రపంచంలోని  అత్యధికంగా కోట్లాది మంది చూసిన కార్యక్రమం అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట అని వెల్లడించారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం రాముడి ప్రాణప్రతిష్ట అని వెల్లడించారు. ప్రతి భారతీయుడు మమేకమై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు..


'ఆధ్యాత్మికవేత్తలు, కవులు, కళాకారులు, నటులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులందరినీ ఒక దగ్గరకు చేర్చిన మహత్తర ఘట్టం ఇది. రామచంద్రుడు 14 ఏళ్ల వనవాసం తర్వాత నేడు మరోసారి అయోధ్యలో కొలువుదీరాడు. ఈ కార్యక్రమం భారతీయ, జాతీయ, అధ్యాత్మిక సాంస్కృతిక ప్రతిబింబం' అని చెప్పారు. భారతీయ జీవన విధానానికి, సంస్కృతికి, ఆధ్యాత్మికతకు అద్దంపడుతున్న మహోజ్వల ఘట్టం అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం అని తెలిపారు. 


'నారాయణమ్మ విద్యాసంస్థల వ్యవస్థాపకులు పుల్లారెడ్డి రామాలయం నిర్మాణం కోసం పరితపించారు. నాడు విశ్వహిందూ పరిషత్ అఖిల భారత జాతీయ అధ్యక్షులుగా పుల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి అశోల్ సింఘాల్ ఆధ్వర్యంలో రామజన్మభూమి ఉద్యమాన్ని ప్రోత్సహించారు. ఉద్యమం సమయంలో దేశంలోనే పెద్దమొత్తంలో ఆర్థిక సాయం చేసిన మహోన్నత వ్యక్తి పుల్లారెడ్డి' అని కిషన్‌ రెడ్డి గుర్తు చేశారు. రామజన్మభూమి కోసం ఉద్యమించిన పుల్లారెడ్డి ఆత్మ నేడు అయోధ్యలోని రామమందిరం ప్రారంభోత్సవం ఘట్టంతో శాంతించి ఉంటుందని తెలిపారు.

Also Read Lok Sabha Elections: సర్వీసింగ్‌కు వెళ్లిన 'కారు' యమస్పీడ్‌తో దూసుకొస్తది: కేటీఆర్‌


Also Read: Ayodhya Pran Pratishtha: గుడిలో బండలు తుడిచిన కేంద్రమంత్రి అమిత్ షా, తెలంగాణ గవర్నర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి