Kishan Reddy On Abrogation Of Article 370: మోదీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు భారతదేశ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశ ప్రజలందరూ ఈ నిర్ణయాన్ని ఏకకంఠంతో స్వాగతించారని అన్నారు. కొన్ని పార్టీలు అనేక రకాల విషప్రచారం చేసినా.. జమ్మూ పాకిస్తాన్ ప్రజలు స్వాగతం పలికారని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అన్ని రాష్ట్రాలతోపాటుగా జమ్మూకశ్మీర్లోనూ సమానమైన అభివృద్ధి జరగాలని.. ప్రజలకు హక్కులు, అధికారాలుండాలనేది ప్రధాని మోదీ  సంకల్పమన్నారు. ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"రాళ్లు, తుపాకులు పట్టిన కశ్మీరీ యువత చేతుల్లో కంప్యూటర్లు పెట్టి వారిలో మార్పు తీసుకురావాలన్న మోదీ గారి సంకల్పానికి సుప్రీంకోర్టు సమర్థించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాం. 2019 ఆగస్టు 5నాడు పార్లమెంటులో ఈ ఆర్టికల్ రద్దయింది. పర్యాటకులు 2022లో కోటి 80 లక్షల మంది.. ఈ ఏడాది 11 నెలల్లోనూ 2 కోట్లను దాటిన పర్యాటకుల సంఖ్య. 40 ఏళ్ల తర్వాత టూరిజం మినిస్ట్రీ ద్వారా జీ20 సదస్సు ప్రశాంతంగా జరగడం.. అక్కడ నెలకొన్న పరిస్థితికి నిదర్శనం. కాంగ్రెస్ నాయకులు, విపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ.. అక్కడ ప్రజల  హక్కుల కాలరాస్తున్నారని దుష్ప్రచారం చేశారు. దేశాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వెళ్లే ప్రయత్నం చేశారు. ఏదేమైనా అక్కడ అన్ని పరిస్థితులు చక్కబడ్డాయి. 


కొన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో.. నిరాశ, నిస్పృహలు వ్యక్తం చేస్తున్నారు. వారికి జమ్మూకశ్మీర్లోని మహిళల హక్కులు పునరుద్ధరించడం ఇష్టం లేదు. పాక్ ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్ నుంచి తరిమికొట్టడం ఇష్టం లేదు. శ్రీనగర్లోని లాల్ చౌక్ లో త్రివర్ణ పతకాం ఎగరాలంటే పోలీసుల పహారా లేకుండా  సాధ్యమయ్యేది కాదు. కానీ ఇవాళ స్వచ్ఛందంగా ప్రజలే మన దేశ జెండాలు ఎగరేస్తున్నారు. అక్కడి యువతను.. వేర్పాటువాద నాయకులు.. రెచ్చగొట్టి రాళ్లు వేయించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది.." అని కిషన్ రెడ్డి అన్నారు.


కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ అని ఆయన విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు కాలేదు.. కానీ.. 5 ఏండ్లకు సరిపడా వ్యతిరేకతను మూటగట్టుకుంటోందన్నారు. ఛత్తీస్‌గడ్‌లో అవినీతి ఎక్కువైనందునే ఆ పార్టీని ఓడించారని అన్నారు. గత తొమ్మిదేన్నర ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒకచిన్న అవినీతి  మరకకూడా లేకుండా పనిచేస్తోందన్నారు. కర్ణాటక బిల్డర్లను బెదిరించి, కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి తెలంగాణ ఎన్నికల్లో వినియోగించారని ఆరోపించారు.


ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసినట్లుప ప్రచారం జరుగుతోంది. ఈ విమర్శలపై కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. "సోషల్ మీడియాలో నేను పవన్ కల్యాణ్‌ను ఏదో అన్నట్లు దుష్ప్రచారం  జరిగింది. దీన్ని ఖండిస్తున్నాను. అలాంటి మాటలే జరగలేదు. ఎవరో ఏదో రాసి పెడితే.. ఎలా..? దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. నియమాలకు విరుద్ధంగా, సీనియారిటీని కాదని, తమ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ.. మజ్లిస్‌కు చెందిన వ్యక్తిని ప్రొటెం స్పీకర్‌గా నియమించడం.. శాసనసభ నిబంధనల ఉల్లంఘన. అందుకే మేం ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తాం. రెగ్యులర్ స్పీకర్ వచ్చాకే ప్రమాణస్వీకారం చేస్తాం.." అని కిషన్ రెడ్డి అన్నారు. 


Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా


Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి