Kishan Reddy On 111 Go Cancellation: నీతి ఆయోగ్​ మీటింగ్‌​కు సీఎం కేసీఆర్​ ఎందుకు వెళ్లట్లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దేశ్​ కీ నేత అనుకున్నప్పుడు.. దేశ ఆర్థిక పరిస్థితిపై సమావేశం ఉంటే ఎందుకుపోరు..? అని అడిగారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద కేసీఆర్​ సర్కారుకు సోయి లేదని విమర్శించారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ – ఇవ్వాళ నీతి ఆయోగ్​ 8వ సమావేశం ఢిల్లీలో జరుగుతోందని చెప్పారు. వచ్చే 25 ఏళ్లలో భారత్​ అభివృద్ధి చెందిన దేశంగా ఎలా అవతరించాలో అక్కడ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఆర్థిక నిపుణులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో చర్చ జరుగుతోందన్నారు. అయితే ఈ సమావేశానికి కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని అడిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"రైతులకు 50 వేల కోట్ల రుణ మాఫీ చేయాల్సి ఉన్నది. జీతాలు టైమ్‌కు ఇచ్చే పరిస్థితి లేదు. రోజు రోజుకూ కట్టాల్సిన అప్పులు ముంచుకొస్తున్నాయి. వడ్డీ కట్టుడు అయిపోయింది.. ఇప్పుడు అసలు కట్టాల్సి వస్తున్నది. అయినా ఈ సర్కారుకు సోయిలేదు. ఎంతసేపు ప్రగతి భవన్​లో కూర్చొని.. మహారాష్ట్రలో పనికిమాలినోడు ఎవడున్నడు..? వారిని పార్టీలో ఎలా చర్చుకుందాం..? మోడీని ఎట్ల తిడదాం.. ఇవే చర్చ. ఇన్ని అప్పులు తెచ్చినా.. ఉద్యోగులకు టైమ్‌కు జీతాలు ఎందుకు ఇస్తలేరు..? ప్రభుత్వం రుణమాఫీ చేస్తలేదని రైతులు బ్యాంకులో అప్పు కట్టలేదు. ప్రభుత్వం ఇవ్వకపోవడంతో బ్యాంకులు రైతులను డిఫాల్టర్లుగా చేసి.. మళ్లీ రుణాలు ఇవ్వడం లేదు.


అడ్డగోలుగా అప్పులు చేసి అవతలపడితే.. తర్వాత తెలంగాణ ప్రజలు, మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారమే.. బడ్జెటేతర లెక్కలు కలపుకుంటే 6 లక్షల కోట్లు తెలంగాణ అప్పు ఉంది. ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తుంటే.. రిజర్వ్​ బ్యాంకు కొన్ని కండీషన్లు పెడితే.. దాన్ని రోజూ విమర్శిస్తారు. అందుకే భూముల మీద 30 వేల ఎకరాలను అమ్మకానికి సిద్ధం పెట్టింది. 111 జీవో ఎత్తేస్తే.. హైదరాబాద్​ భవిష్యత్​ ఎట్ల..? 111 జీవో ఎత్తేస్తే.. హైదరాబాద్‌లో ఉన్న ఇండ్లు, హాస్పిటల్స్‌లో వరద ముప్పు మాటేమిటి..? అసైన్డ్​ భూములు, ఎండోన్మెంట్​ భూములు లాక్కుంటున్నది. వరంగల్​ జైలు భూమి తాకట్టు పెడుతున్నది.


దళితులకు  మూడెకరాల భూమి, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు. తెలంగాణ వస్తే.. నేను కాపలా కుక్కలెక్క ఉంటా.. దళితుడే మొదటి సీఎం అని చెప్పిన కేసీఆర్​.. మాట తప్పితే తలనరుక్కుంట అన్నాడు. ఆ లెక్క ప్రకారం ఆయన తల ఇప్పటికే ఎన్నోసార్లు తెగిపడాల్సి ఉండే. బీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసుకు, కాంగ్రెస్​ పార్టీ ఆఫీసుకు పదెకరాల భూమి తీసుకుంటూ జీవో ఇచ్చారు.  కాంగ్రెస్​, బీఆర్ఎస్​ కుమ్మక్కైనయి.." అని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.  


బినామీ పేర్లతో పాలక పార్టీ నేతల భూములు ఉన్నందుకే 111 జీవో ఎత్తేశారని ఆయన ఆరోపించారు. దేశంలో రాజకీయ పార్టీలకు డబ్బు పంచడానికి, ఆదాయం సమకూర్చుకోవడానికే 111 జీవో ఎత్తేశారని అన్నారు. గ్రీన్​ సిటీ పాలసీకి తూట్లు పొడ్చారని.. జీవ వైవిధ్యానికి హాని కలిగిస్తున్నారని మండిపడ్డారు. సెక్రటేరియట్‌​కు ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు వెళ్లే పరిస్థితి లేదన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అప్పులు చేసిన రాష్ట్రంలో తెలంగాణ నెంబర్​ వన్ అని విమర్శించారు.​


రాష్ట్రంలో ఎన్ని అప్పులు చేశారో కేసీఆర్​ చెప్పాలని.. అవి ఎక్కడి నుంచి తీసుకున్నారో బయటపెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక్కో కార్పొరేషన్​ పేరు మీద ఎంత అప్పు చేశారో తెలపాలని అడిగారు. రాష్ట్రాలకు గతంలో కేంద్ర ప్రభుత్వం 32 శాతం పన్నులు ఇచ్చేదని.. మోడీ ప్రభుత్వం వచ్చాక దాన్ని 42 శాతం ఇస్తోందన్నారు. రాష్ట్ర సర్కారు పంచాయతీలకు ఎన్ని డబ్బులు ఇస్తున్నదో చెప్పాలన్నారు. మంత్రులు ప్రెస్​ మీట్​ పెట్టి మాట్లాడటం కాదని.. చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్​ మాట్లాడాలని అన్నారు. 


Also Read: Palnadu Murder Case: కుమారుడి తల నరికిన తండ్రి.. ఊరంతా తిరుగుతూ హల్‌చల్  


Also Read: GT vs MI Highlights: నెట్‌ బౌలర్‌ టు మ్యాచ్ విన్నర్.. మోహిత్ శర్మ వాట్ ఏ బౌలింగ్   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి