Kishan Reddy Receives COVID-19 Vaccine At Gandhi Hospital: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ విజయవంతంగా కొనసాగుతోంది. మార్చి 1న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా టీకా తీసుకుని దేశ ప్రజలకు వ్యాక్సిన్‌లపై భరోసా కల్పించారు. వారిలో ఉన్న భయాందోళనల్ని దూరం చేసే ప్రయత్నం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేడు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కరోనా టీకా వేయించుకున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కిషన్ రెడ్డి కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు. ఆ సమయంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అక్కడే ఉన్నారు. కరోనా వ్యాక్సిన్లపై ఎలాంటి అపోహలు వద్దని, నిర్భయంగా అర్హులైన వారు టీకాలు తీసుకునేందుకు రావాలని కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నేత ఈటల రెండో దశ వ్యాక్సినే షన్ ప్రారంభమైన తొలిరోజే కరోనా టీకా తీసుకుని తెలంగాణ ప్రజలలో కోవిడ్19 టీకాలపై విశ్వాసాన్ని పెంచారు.


Also Read: 7th Pay Commission Latest News: ఇన్‌కమ్ ట్యాక్స్ అదనపు ప్రయోజనాలు పొందాలనుకుంటే Govt Employeesకు శుభవార్త  


కాగా, రెండో దశ కరోనా వ్యాక్సిన్ మార్చి 1వ తేదీన ప్రారంభమైంది. ప్రజలలో కరోనా వ్యాక్సిన్లపై విశ్వాసం పెంచడంలో భాగంగా తొలి రోజు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెన్నైలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కోవిడ్ వ్యాక్సిన్(COVID-19 Vaccine) మొదటి డోసు తీసుకున్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహా పలువురు ప్రముఖులు కోవిడ్-19 టీకా తీసుకున్నారు. ప్రజలు ఎలాంటి అనుమానాలు లేకుండా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook