Vande Bharat Express Hyderabad To Bangalore: నేడు ఒకే రోజు 9 వందే భారత్​ రైళ్లను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం గొప్ప విషయని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ తొమ్మిది రైళ్లు ప్రఖ్యాత 111 నగరాలను అనుసంధానం చేయనున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే రెండు వందే భారత్​ రైళ్లు వచ్చాయని.. ఆదివారం మూడో వందే భారత్ రైలు వచ్చిందని చెప్పారు.​ హైదరాబాద్​–బెంగళూరు రైలును ప్రధాని ప్రారంభిస్తున్నారని.. వినాయక చవిత సందర్భంగా మూడో ట్రైన్​ ప్రారంభించుకోవడం శుభపరిణామన్నారు. హైదరబాద్ కాచిగూడ నుంచి ప్రారంకానున్న నూతన వండే భారత్ రైలు.. మూడు రాష్ట్రాలలోని12 జిల్లాలను కలుపుతుందని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక నుంచి ఒక్క రోజులలో బెంగుళూరుకు వెళ్లి రావొచ్చని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. వచ్చే నెల ​ 1, 3వ తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణకు రాబోతున్నారని..  ఆ రోజు కూడా అనేక  రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏటా 55 కిలోమీటర్ల రైల్వే లైన్​ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో రైల్వే నెట్ వర్క్ తగ్గువగా ఉందని.. మనకు అధిక రైల్వే ప్రాజెక్టులు ఇస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది తెలంగాణకు రూ.4,418 కోట్ల రైల్వే బడ్జెట్‌ను కేంద్రు ప్రభుత్వం కేటాయించినట్లు గుర్తు చేశారు. 


మన రాష్ట్రంలో 31 వేల కోట్ల రూపాయల రైల్వే పనులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు కేంద్ర మంత్రి. దాదాపు రూ.2,300 కోట్లతో అనేక రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని.. 21 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారని చెప్పారు. సికింద్రాబాద్​ స్టేషన్‌​కు రూ.717 కోట్లు కేటాయించి.. ప్రధాని శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్​ ఎయిర్‌పోర్ట్ మాదిరే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉండబోతుందన్నారు.


ప్రస్తుతం నాంపల్లి రైల్వే స్టేషన్​ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయని.. కాచిగూడ ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభించబోతున్నామని తెలిపారు కిషన్ రెడ్డి. చర్లపల్లిలో రూ.221 కోట్ల న్యూ టెర్మినల్​ నిర్మాణం కాబోతుందని.. కాజీపేటలో రైల్​ మ్యానుఫ్యాక్చర్​ యూనిట్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. మొదట వ్యాగన్​ మ్యానుఫ్యాక్చరింగ్​ మొదలవుతుందని.. తర్వాత రైలుకు సంబంధించిన అన్ని ఉత్పత్తులు అక్కడ తయారవుతాయని చెప్పారు. 


Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    


Also Read: Realme C53 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో realme C53 మొబైల్స్‌పై మీ కోసం స్పెషల్‌ డిస్కౌంట్‌..రూ. 5,900కే పొందండి!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి