హైదరాబాద్ నగరంలో భారీ దోపిడీ జరిగింది. ఆదివారం బషీర్ బాగ్ లో ఈ దోపిడీ జరగడంతో పోలీసులు ఖంగుతిన్నారు. దోపిడీ కమీషనర్ కార్యాలయం వెనుకవైపు జరగడం గమనార్హం.


వివరాలలోకి వెళితే బెంగళూరు వ్యాపారులు ఒక బిజినెస్ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు. వారు నగదును సంచులతో  వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆ బ్యాగుతో అక్కడి నుంచి ఉడాయించారు. అందులో ఉన్న 1.26 కోట్లు నగదు చోరీకి గురైనట్లు ఆ ముగ్గురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాపు ప్రారంభించారు. చోరీకి గురైన ప్రాంతంలో వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.