అది విష సంస్కృతి: భజరంగ్ దళ్
ప్రేమికుల దినోత్సవం సందర్బంగా సికింద్రాబాద్ వద్ద గల నేరెడ్‌మెట్‌లో వాలెంటైన్స్ డే వేడుకలకు వ్యతిరేకంగా ర్యాలీని చేపట్టడానికి ప్రయత్నించిన పలువురు బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ : ప్రేమికుల దినోత్సవం సందర్బంగా సికింద్రాబాద్ వద్ద గల నేరెడ్‌మెట్‌లో వాలెంటైన్స్ డే వేడుకలకు వ్యతిరేకంగా ర్యాలీని చేపట్టడానికి ప్రయత్నించిన పలువురు బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడాన్ని భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసిస్తూ, వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు. కాగా, ర్యాలీకి ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో నేరెడ్‌మెట్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ర్యాలీగా బయలుదేరిన భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రేమికుల దినోత్సవం, భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని, అది పాశ్చాత్య సంస్కృతని ర్యాలీలో నినాదాలు చేశారు. భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లని వాటిని కాపాడవలిసిన భాద్యత మనపై ఉందని నినాదాలు చేశారు.
గత ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రవాద దాడిలో మరణించిన సీఆర్పిఎఫ్ అమర జవాన్లకు నివాళులర్పించాలని భజరంగ్ దళ్ కార్యకర్తలు యువతకు సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..