Venkatesh Election Campaign: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నెలకొంది. ఏపీలో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఏపీలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, హిందూపూర్ నుంచి మూడోసారి బాలకృష్ణ, నగరి నుంచి రోజా వివిధ పార్టీల నుంచి పోటిలో ఉన్నారు. అటు తెలంగాణలోని ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున రామసహాయం రఘురామిరెడ్డి బరిలో ఉన్నారు. ఈయన స్వయానా.. హీరో వెంకటేష్ వియ్యంకుడు. ఈ నేపథ్యంలో వియ్యంకుడు గెలుపు కోసం వెంకటేష్ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా వెంకీ మామ మాట్లాడుతూ.. భద్రాచలంలో శ్రీరాముడున్నాడు... ఖమ్మం లోక్‌సభ ఎన్నికల బరిలో రఘురాముడున్నాడు.. అని ప్రజలను ఉత్తేజపరిచేలా ప్రసంగాలు చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో రఘురామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ రోడ్డు షో నిర్వహించారు. వెంకటేష్ చూడటానికి అభిమానులు, సామాన్యులు ఎగబడ్డారు. అటు వెంకటేష్ గతంలో 1999, 2004లో తన తండ్రి డి.రామానాయుడు ప్రాతినిథ్యం వహించిన బాపట్ల లోక్‌సభ పార్లమెంటు పరిధిలో ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. 1999లో టీడీపీ తరుపున ఎంపీగా గెలిచిన రామానాయడు..2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పురంధేశ్వరి చేతిలో ఓటమి పాలయ్యారు.


ఈ ఎన్నికల ర్యాలీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు..రేణుకా చౌదరి, ఖమ్మం ఎంపీ క్యాండిడేట్ రఘురాం రెడ్డితో పాటు.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్, సీపీఎం, సీపీఐ నాయకులతో కలిసి మయూరి సెంటర్ నుంచి వైరా రోడ్డు మీదుగా జడ్పీ సెంటర్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం 6 గంటల సమయంలో ప్రారంభమైన ర్యాలీ.. రాత్రి 8 గంటల వరకు కొనసాగింది.


రఘురాం రెడ్డి విషయానికొస్తే..


ఈయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడిగా రఘురాం రెడ్డి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. వీరి స్వస్థలం ఖమ్మం జిల్లా పాలేరు. నియోజకవర్గం జేగొమ్మ గ్రామం. సురేందర్ రెడ్డి గతంలో మహబూబా బాద్, వరంగల్ లోక్ సభ స్థానం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. అటు ఉమ్మడి వరంగల్‌లోని డోర్నకల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన హిస్టరీ ఉంది. రఘురాం రెడ్డి 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు. డోర్నకల్ నియోజకవర్గం ఇంఛార్జ్‌గా .. వరంగల్ లోక్ సభ సీటు ఇంఛార్జ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. హైదరాబాద్ రేస్ కోర్స్ క్లబ్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు.


Read More: WomanThrows Son: పసిబిడ్డను మొసళ్లకు ఆహరంగా వేసిన కసాయి తల్లి..కారణం ఏంటో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter