Once Again KCR CM: రెండు దశాబ్దాలు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం.. దశాబ్దం పాటు ప్రగతి పాలన అందించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుకు శుభ ఘడియలు రానున్నాయని.. మళ్లీ ముఖ్యమంత్రి కావడం పక్కా అని ఓ ప్రముఖ జ్యోతిష్యుడు జాతకం చెప్పారు. ప్రస్తుతం రాహు కాలం కొనసాగుతోందని.. త్వరలోనే ఆయనకు కాలం కలిసి వస్తుందని జోష్యం చెప్పారు. పరిస్థితులు కలిసి వచ్చి కేసీఆర్‌కు రాజయోగం రానుందని విశ్లేషించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Harish Rao: సెక్యూరిటీ లేకుండా రేవంత్‌ రెడ్డి వస్తానంటే.. నేనే కారు డ్రైవ్‌ చేస్తా


సామాజిక మాధ్యమాలతోపాటు వ్యక్తిగతంగా జ్యోతిష్యం చెబుతూ ప్రశాంత్‌ కిని నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంటారు. ఆయన చెప్పే జ్యోతిష్యంపై ప్రజల్లో బాగా నమ్మకం ఉండడంతో ఆయనను ఫాలో అవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతకం చెప్పారు. కేసీఆర్‌కు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్‌లో ఎలా ఉండబోతున్నదనేది శనివారం తన 'ఎక్స్‌'లో పోస్టు చేశారు. ఆ పోస్ట్‌ కాస్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

Also Read: Bandi Sanjay: గ్రూప్‌ 1 వాయిదా వేయకుంటే.. రేవంత్‌ ప్రభుత్వం పడిపోయే ప్రమాదం?


ప్రశాంత్‌ కిని ప్రకారం.. కేసీఆర్‌ జ్యోతిష్యం ఇలా ఉంది..
'రాహు అంతరదశ ప్రారంభమైన సమయంలో కేసీఆర్‌ ముఖమంత్రి పదవిని కోల్పోయారు. కేసీఆర్‌ జాతకం ప్రకారం.. రాహు నుంచి కుజుడు 12వ స్థానంలో కూర్చున్నాడు. 2024 సెప్టెంబర్‌ నుంచి గురుడు దశ ప్రారంభమైంది. అక్టోబర్‌ 2026లో రాజకీయంగా విఫలమవుతారు. కానీ 2027 జనవరిలో అతడి భవిష్యత్‌ అనేది అనూహ్యంగా మారుతుంది' ప్రశాంత్‌ కిని పోస్టు చేశారు.


మళ్లీ ముఖ్యమంత్రి యోగం
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని విధాల ఘోరంగా వైఫల్యం చెందుతున్న నేపథ్యంలో మరోసారి కేసీఆర్‌ అవసరం తెలంగాణలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్నే జ్యోతిష్యుడు ప్రశాంత్‌ కిని చెప్పాడని బీఆర్‌ఎస్‌ పార్గీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవడం పక్కా అని గులాబీ వర్గాల్లో పూర్తి విశ్వాసం ఏర్పడింది.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter