Viral News: పూల దండ కాదు..నోట్ల దండే..అవినీతి అధికారికి వెరైటీ సత్కారం..
Corrupt Official Viral News: లంచం తీసుకున్న అధికారికి సరైన గుణపాఠం చెప్పారు బాధితులు. లంచం డిమాండ్ చేసిన అధికారికి ఇవ్వాల్సిన డబ్బును దండంగా చేసి మెడలో వినూత్న తీరితో సత్కారం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Corrupt Official Viral News: అతను ఓ ప్రభుత్వ అధికారి..ప్రభుత్వం నుంచి నెలనెలా జీతం తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాలసిందిపోయి.. లంచాలకు కక్కుర్తి పడి అడ్డదారి తొక్కాడు. ప్రజలు మాత్రం ఆ అధికారికి సరైన గుణపాఠం చెప్పారు. లంచం పేరు ఎత్తితే పరిణామాలు ఎలా ఉంటాయో రుచి చూపించారు. లంచం అడిగిన ఓ అధికారికి నోట్ల దండతో సత్కారం చేసి బుద్ధి చెప్పారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా..
జిల్లా కలెక్టరెట్‌లో మత్స్యశాఖ అధికారిగా దామోదర్ పనిచేస్తున్నారు. ఇటీవలే మత్స్యకార సొసైటీల ఏర్పాటు కోసం అధికారుల నుంచి ఆదేశాలు రాగా.. సొసైటీల ఏర్పాటు కోసం నేరుగా ప్రజల నుంచి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు లంచంగా ఇవ్వాల్సిన డబ్బును దండంగా తయారు చేసి మెడలో వేశారు. అవినీతికి పాల్పడిన అధికారికి ఈ వినూత రీతిలో సత్కారం చేయడంతో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
జగిత్యాల జిల్లా కలెక్టరెట్‌లో మత్స్యశాఖ అధికారిగా దామోదర్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఇటీవలే కల్వకోట, భీమారం, బొమ్మన, మంగేలా గ్రామాలకు కొత్త మత్స్యశాఖ సొసైటీల ఏర్పాటు చేయమని కోర్టు ఆర్డర్ చేసింది. ఇదే దొరికింది ఛాన్స్ అని కాసులకు ఆశపడ్డారు మత్స్యశాఖ అధికారి దామోదర్..తనకు లంచంగా డబ్బులు ఇస్తేనే సొసైటీ ఫైల్ ముందుకు వెళ్తుందని దౌర్జనం చేశాడు. దీంతో బాధితులంతా కలిసి లంచంగా ఇవ్వాల్సిన డబ్బును దండంగా చేసి మెడలో వేసి వెరైటీ సత్కారం చేశారు. ఈ దృశ్యాలను కొందరు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడ ఇది కాస్త వైరల్‌గా మారింది.
మరో గుణపాఠం:
అవినీతికి పాల్పడిన అధికారులకు బాధితులు వివిధ రీతిలో గుణపాఠం చెబుతున్నారు. ఇటీవలే అవినీతి ఆరోపణలు ఎదురుకున్న నల్లగొండ జిల్లా కనగల్‌కు చెందిన ఎస్‌ఐ అంతిరెడ్డిని ఉన్నతాధికారులు ట్రాన్స్ ఫర్ చేసిన సంగంతి తెలిసిందే.. ఇసుక అక్రమ రవాణాలో ఎస్‌ఐ అంతిరెడ్డి అవినీతికి పాల్పడారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అంతిరెడ్డిని వీఆర్కు అటాచ్ చేస్తూ..జిల్లా ఎస్పీ అపూర్వరావు ఉత్తర్వులు జారీ చేశారు. దేవరకొండ బందోబస్తులో ఎస్ఐ అంతిరెడ్డి ఉండగానే కనగల్‌కు అధికారులు కొత్త ఎస్ఐ పంపారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి