Ganesh Shoba Yatra: రాత్రి నుండి రోడ్లపైనే వినాయక విగ్రహాలు.. నిర్మల్ జిల్లాలో హై టెన్షన్
Ganesh Shobay Yatra: వినాయక శోభాయాత్ర నిర్మల్ జిల్లాలో ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు తమపై దాడికి దిగారంటూ భక్తులు ఆందోళనకు దిగారు. వినాయక విగ్రహాలను రోడ్లపైనే ఉంచి నిరసన తెలిపారు. దీంతో నిర్మల్ జిల్లా ముధోల్ లో మంగళవారం రాత్రి నుంచి హై టెన్షన్ నెలకొంది.
Ganesh Shoba Yatra: వినాయక శోభాయాత్ర నిర్మల్ జిల్లాలో ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు తమపై దాడికి దిగారంటూ భక్తులు ఆందోళనకు దిగారు. వినాయక విగ్రహాలను రోడ్లపైనే ఉంచి నిరసన తెలిపారు. దీంతో నిర్మల్ జిల్లా ముధోల్ లో మంగళవారం రాత్రి నుంచి హై టెన్షన్ నెలకొంది. రాత్రి నుండి రోడ్లపైనే వినాయక విగ్రహాలు ఉన్నాయి. వినాయక విగ్రహాలను ఊరేగించిన ట్రాక్టర్ ట్రాలీలను రోడ్లపైనే వదిలేసి... ఇంజన్లను తీసుకుని ఇండ్లకు వెళ్లిపోయారు మండపాల నిర్వాహకులు. చివరి రోజు వరకు రోడ్డుపైనే విగ్రహాలు ఉంచుతామని స్పష్టం చేశారు. పోలీసులు ఎంతగా వారించినా భక్తులు వినకపోవడంతో ఉద్రిక్తత తలెత్తింది.
ముధోల్ లో మంగళవారం వినాయక నిమజ్జన యాత్ర సాగింది. అయితే ఊరేగింపులో డీజేలపై పోలీసులు నిషేదం విధించారు. నిర్వాహకులు మాత్రం డీజేలు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు డీజేలను తొలగించాలని నిర్వాహకులను ఆదేశించారు. అందుకు భక్తులు ఒప్పుకోలేదు. ఈ విషయంలోనే భక్తులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా భక్తులను పోలీసులు చెదరగొట్టారు. అయితే కొందరు పోలీసులు ఓవరాక్షన్ చేశారని.. తమపై దాడి చేశారని భక్తులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులను భక్తుల బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. పోలీసుల దాడిలో పలువురు వృద్ధులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు బూట్లతో తన్ని, లాఠీలతో కొట్టారని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook