Lagacharla Farmers: 'లగచర్లలో భూముల సేకరణ అంశంలో ప్రభుత్వం తీవ్రంగా భంగపడింది. దాన్ని కవర్ చేసుకునేందుకే ఇది కుట్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం రైతుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోంది. కలెక్టర్‌పై దాడి చేశారంటూ దాదాపు 50 మంది రైతులను స్థానిక ఎస్పీ దగ్గరుండి కొట్టించాడు. బీఆర్ఎస్ వాళ్లను కొట్టి మిగతా పార్టీ వాళ్లను వదిలేశారు. సంఘటన జరిగినప్పుడు అక్కడ లేని బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకెళ్లి అమానుషంగా కొట్టారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కేటీఆర్‌ వివరించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KT Rama Rao: లగచర్ల గ్రామానికి వెళ్తాం.. ఎవడు ఆపుతాడో చూస్తాం: కేటీఆర్‌ సంచలనం


ఇంత అరాచకం జరుగుతుంటే గతంలో మానవ హక్కుల గురించి మాట్లాడిన కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్‌ లాంటి వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదు? అని కేటీఆర్‌ సందేహం వ్యక్తం చేశారు. 'లగచర్లలో మేము కుట్ర చేసినట్లైతే మీడియా వాళ్లు వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు. మీరు ఆ గ్రామానికి వెళ్తే ప్రజలే ఏమీ జరిగిందో చెబుతారు' అని మీడియాకు సూచించారు. 'సురేశ్‌ అనే వ్యక్తి మా పార్టీ కార్యకర్తే. అతడికి భూమి ఉంది' అని స్పష్టం చేశారు.

Also Read: Rashtrapati: తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఎప్పుడు, ఎందుకో తెలుసా?


'భూమి లేని వాళ్లే గొడవ చేశారంటూ పోలీసులు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. పోలీసులు, ఐపీఎస్ అధికారులకు ఇంత స్వామి భక్తి వద్దు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం' అని కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. తప్పు చేసిన అధికారుల విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో అదే జరుగుతుందని పేర్కొన్నారు. లగచర్లలో జరిగిన ఘటనలో పూర్తిగా నిఘా, పోలీసుల వైఫల్యం ఉందని వివరించారు.


'అభిప్రాయ సేకరణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఎందుకు అక్కడ లేరు' అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 'పట్నం నరేందర్ రెడ్డి ఏదో నా పేరు చెప్పాడని రిమాండ్ రిపోర్ట్‌లో రాశారనడం బక్వాస్' అని కొట్టిపారేశారు. రైతులపై దాడికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్‌కు వెళ్లినట్లు వెళ్లారని.. పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తూ రైతులను ఇష్టమొచ్చినట్లు కొట్టారని వివరించారు. 'ఒక అమ్మాయి ఛాతి మీద కాలు పెట్టి ఆమె భర్తను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ విషయాన్ని ఆ అమ్మాయి మీడియాతో చెబుతూ ఎంతో బాధపడింది' అని గుర్తుచేశారు.


'నా మీద కేసు పెడితే నేను ఊరుకుంటా అనుకుంటే రేవంత్ రెడ్డి అంతే పిచ్చోడు మరొకరు ఉండరు. జైలు నుంచి వచ్చాక కూడా పోరాటం చేస్తా' అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 'లగచర్ల అంశాన్ని ఇంతటితో నేను వదిలిపెట్టను.. ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల, మహిళా కమిషన్ వరకు తీసుకెళ్తా' అని ప్రకటించారు. కొడంగల్‌లో భూముల సేకరణకు ఇంత గొడవ జరిగితే.. ముచ్చర్లలో ఎంతో విలువైన భూములు ఉన్ గొడవ జరిగిందా? అని ప్రశ్నించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి