TS Weather Alerts: హైదరాబాద్‌లో భానుడి భగభగలు..ఉష్ణోగ్రతలు ఎంతంటే..!
TS Weather Alerts: తెలంగాణలో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఓ పక్క ఎండల తీవ్రత పెరుగుతుంటే..మరో పక్క చిరు జల్లులు కురుస్తున్నాయి.
TS Weather Alerts: తెలంగాణలో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఓ పక్క ఎండల తీవ్రత పెరుగుతుంటే..మరో పక్క చిరు జల్లులు కురుస్తున్నాయి. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సాయంత్రం, రాత్రి వేళల్లో వేడి గాలులతోపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది. ఇటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. భాగ్యనగరంలోని పలు చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
చార్మినార్, ఉప్పల్‌లో అత్యధికంగా 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతగా నమోదు అయ్యింది. కూకట్‌పల్లి,నాంపల్లి, హయత్‌నగర్‌ల్లో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత, సరూర్‌నగర్‌లో 41.4, సైదాబాద్‌లో 40.9, షేక్‌పేట్‌లో 40.9, మారేడ్‌పల్లిలో 40.8, కాప్రాలో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిశాయి. అదే స్థాయిలో భానుడి భగభగలు ఉన్నాయి.
ఎండ తీవ్రతతో హైదరాబాద్‌వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉక్కపోతతో తల్లడిల్లుతున్నారు. ఉపశమనం పొందేందుకు శీతలపానీయాలు సేకరిస్తున్నారు. మరోవైపు దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించారు. ప్రస్తుతం కేరళలో విస్తరిస్తున్నాయి. త్వరలో తెలుగు రాష్ట్రాల్లోకి రానున్నాయి. వీటి రాకతో వాతావరణం చల్లబడుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటివరకు ప్రజలంతా అలర్ట్‌గా ఉండాలని వాతావరణ శాఖ చెబుతోంది. ఇటు ఢిల్లీలోనూ ఎండల తీవ్రత అధికంగా ఉంది.
Also read: AP 10th Results: ఏపీలో రేపే పదో తరగతి ఫలితాలు..విడుదల చేయనున్న మంత్రి బొత్స..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook