Rains for two days in Telangana State: ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ (Telangana) రాష్ట్రం వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడం, వాయువ్య భారత ప్రాంత వాతావరణంలో నెలకొన్న అస్థిరత ప్రభావంలో రెండు రోజుల పాటు వర్షాలు (Rains) కురవనున్నాయి. సోమ, మంగళవారం తెలంగాణాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల చిరు జల్లులు కురవనుండగా.. మరికొన్ని చోట్ల సాధారణ ఎండ కాయనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు (Telangana Rains) కురిశాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 11 ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిసాయి. అత్యధికంగా ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బరంపూర్‌లో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా.. నిర్మల్‌ (Nirmal)లోని దస్తురాబాద్‌లో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 


Also Read: Today Horoscope January 10 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి శుభవార్తలు అందుతాయి!!


ఆదివారం ఉష్ణోగ్రత సాధారణం కన్నా మూడు డిగ్రీలు పెరగడంతో చలి తీవ్రత కాస్త తగ్గింది. ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా రంగారెడ్డి (Rangareddy) జిల్లా తాళ్లపల్లిలో 15.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో తేమ సాధారణం కన్నా ఎక్కువగా ఉంటోంది. ఉదయం వేళ పొగ మంచు దట్టంగా ఉంటోంది. శుక్రవారం, శనివారం దట్టమైన పొగ మంచు అలుముకున్న విషయం తెలిసిందే. దాంతో మధ్యాహ్నం వరకు కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. 


Also Read: Nizamabad Family Suicide Case : ఆ నలుగురిని వదలి పెట్టకండి.. వారే మా చావుకు కారణం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి