Rain fall in hyderabad: ఇరు తెలుగు రాష్ట్రాలలో కూడా రుతుపవనాలు వేగంగా విస్తరించాయి. దీనికి తోడు ఉపరితల ద్రోణి ప్రభావం కూడా ఉండటం వల్ల తెలుగు స్టేట్స్ లలో విస్తారంగా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో.. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో ఒక్కసారిగా కొన్ని ప్రాంతాలలో భారీగా వర్షం కురిసింది. లింగంపల్లి, పటాన్ చెరువు, చందానగర్, కూకట్ పల్లి, అమీర్ పేట, నానక్ రామ్ గూడ వంటి పలు ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షంకురుస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..


అనేక ప్రాంతాలలో ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి, పలు చోట్ల చినుకులు పడుతున్నాయి. ఇప్పటికే వాతవరణ శాఖ రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా విస్తరిస్తాయని, దీంతో తుఫాన్ ప్రభావం వల్ల వర్షంకురుస్తుందని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక తెలుగుస్టేట్స్ లోనే కాకుండా.. ఏపీలోని ఇతర జిల్లాలు, తెలంగాణలోని పలు జిల్లాలలో భారీగా వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో వర్షపాతం నమోదవుతుందని, ఈదురు గాలులు వీస్తాయని కూడా ఐఎండీ అలర్ట్ జారీ చేసింది.


కొన్నిరోజులుగా ఎండవేడితో అల్లాడిపోతున్న నగర వాసులకు చల్లని వర్షం కాస్తంతా ఉపశమనం కల్గిస్తుందని చెప్పుకొవచ్చు. సాయంత్ర వేళ వర్షం కురిసేందుకు అవకాశం ఎక్కువగా ఉన్ననేపథ్యంలో ప్రయాణికులు అలర్ట్ గా ఉండాలని వాతావరణ కేంద్రం ఆదేశించింది. మ్యాన్ హోళ్లు, కరెంట్ పోల్స్ దగ్గర అలర్ట్ గా ఉండాలని, జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.


Read more: Shani jayanti 2024: పంచ గ్రహాకూటమి రోజు అద్భుతం.. నవగ్రహాల చుట్టు ప్రదక్షిణలు చేసిన శునకం.. . వీడియో వైరల్..


ట్రాఫిక్ లో ఇరుక్కొకుండా ప్రజలు  ఆఫీస్ అవర్స్ ప్లాన్ చేసుకొవాలని, వర్షంలో జాగ్రత్తగా వాహనాలు నడిపించాలని, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వయోలేషన్ చేయోద్దని కూడా పోలీసులు కోరుతున్నారు.  రానున్న రోజుల్లో మరింత భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకొవాలని అధికారులు కోరుతున్నారు. టూవీలర్ లు నడిపిస్తున్నప్పుడు గుంతలు ఉన్న ప్రాంతాల్లో నీరు చేరిపోయి ఉంటుంది. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజల్నికోరుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter