BRS National Politics: తెలంగాణలో అధికారం కోల్పోయిన షాక్‌లో ఉన్న కేసీఆర్‌కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ పూర్తి స్థాయిలో ఉనికి కోల్పోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఉద్యమ నేపథ్యంలో ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ .. రాష్ట్రంలో అధికారం చేపట్టాకా.. కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో అట్టహాసంగా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసి.. కార్యకలాపాలు ప్రారంభించారు. తమది జాతీయ పార్టీ అని, దేశమంతా రాజకీయాలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. పలు రాష్ట్రాల్లో పర్యటించారు. దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా పార్టీ కమిటీలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలుచుకుంది. ఏపీ శాఖకు తోట చంద్రశేఖర్ ను సారథిని చేశారు. ఒడిశాలో మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ను తన పార్టీలో చేర్చుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కట్ చేస్తే.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కథ దాదాపు ముగిసినట్లు కనిపిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ గ‌ట్టి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయ‌న కాంగ్రెస్‌కు జై కొట్టారు. గిరిధర్ గమాంగ్‌తో పాటు ఆయన భార్య హేమ, కుమారుడు శిశిర్ తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు. గమాంగ్ ఇప్పుడు రాజీనామా చేయడంతో ఒడిషాలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయినట్లేనంటున్నారు. 


ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ బీఆర్‌ఎస్ అధ్యాయం ముగిసినట్లే అంటున్నారు. అక్కడ ఉన్న ఆ పార్టీ నేతలు ఇప్పడు తమ దారి తాము చూసుకుంటున్నారు. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమితులైన నేపథ్యంలో ఆమెతో చాలా మంది నేతలు టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కండువా కప్పుకొని ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. 


ఏడాది క్రితం ఏపీలో అట్టహాసంగా బీఆర్‌ఎస్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఏపీ బీఆర్‌ఎస్ చీఫ్‌గా తోట చంద్రశేఖర్ పగ్గాలు చేపట్టారు.  మాజీ మంత్రి రావెల కిశోర్​బాబు, చింతల పార్థసారథి సహా ఏపీలోని పలు జిల్లాలకు చెందిన నేతలు గత ఏడాది జనవరి 2న బీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్​ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీలో సిట్టింగ్​ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్‌లో ఉన్నట్లు నేతల చేరికల సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. కానీ, ఏడాది తిరగకముందే సీన్‌ రివర్స్‌ అయ్యింది.


బీఆర్‌ఎస్‌ను ఏపీలో విస్తరించడమే లక్ష్యంగా గత ఏడాది జనవరి 18న ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభను కేసీఆర్ నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాము గెలిచి ఢిల్లీకి  వెళామని, ప్రధాని మోదీని ఇంటికి పంపిస్తామని ఆ బహిరంగ సభ వేదికగా కేసీఆర్​ ప్రకటించారు. గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. ఆ తర్వాత కేసీఆర్​ మహారాష్ట్ర రాజకీయాలపై ఎక్కువ దృష్టి సారించడంతో ఏపీలో బీఆర్‌ఎస్ యాక్టివిటీ తగ్గిపోయింది.


గత ఆగస్టు నుంచి తెలంగాణ ఎన్నికలతో బీఆర్‌ఎస్ అధిష్టానం బిజీబిజీగా మారడంతో ఏపీలో ఆ పార్టీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించారు. తోట చంద్రశేఖర్, రావెల కిశోర్​బాబు, చింతల పార్థసారథి లాంటి వారు సైలెంట్ అయ్యారు. దీంతో వారి వెంట బీఆర్ఎస్‌లో చేరిన వాళ్లు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. గులాబీ బాస్ కేసీఆర్‌ ఆస్పత్రిలో చేరినప్పుడు ఏపీ సీఎం జగన్ .. పరామర్శించేందుకు వచ్చినప్పుడు కూడా ఆ సమాచారం ఆంధ్రప్రదేశ్‌లోని బీఆర్‌ఎస్ నేతలకు లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో అసలు బీఆర్‌ఎస్ ఉందా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అటు మహారాష్ట్రాలోనూ బీఆర్ఎస్ లీడర్లు తమ దారి తాము చూసుకుంటున్నారనే చర్చ సాగుతోంది. 


Also Read: EPFO Nominee Rules: పీఎఫ్ నామినీగా కొడుకు, కుమార్తెను చేర్చవచ్చా, ఎవరికి అవకాశం లేదు


Also Read: EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. గడువు పెంచుతూ EPFO కీలక నిర్ణయం..!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter