Kids Whitener Addiction Video: హైదరాబాద్: గ్లోబల్ సిటీగా చెబుతున్న మహా నగరం హైదరాబాద్‌లో రోజుకొక సెన్సేషనల్ క్రైమ్ వెలుగు చూస్తోంది.  ఇప్పటికే ఇటీవల రాడిసన్ బ్లూ హోటల్లోని ఓ పబ్‌లో బయటపడిన రేవ్ పార్టీ ఉదంతం రేపుతున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. సినీ పరిశ్రమలో పెద్ద పెద్ద వాళ్లతో పాటు రాజకీయ, వ్యాపార రంగాల్లోనూ పేరున్న బడాబాబులకు, వారి పిల్లలకు ముడిపెడుతూ అనేక కథనాలు మనం నిత్యం మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ చీకట్లో చాటుమాటున జరిగే బాగోతాలు కాగా.. తాజాగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున పట్టపగలే కనిపించిన మరో సీన్ కూడా ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. మన హైదరాబాద్ మహా నగరం ఎటువైపు వెళ్తోందనే ప్రశ్నలు లేవనెత్తుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకీ ఏం జరిగిందంటే..
తాజాగా విజయనగర్ కాలనీలో కొందరు చిన్నారులు వైట్నర్ సేవిస్తూ మీడియా కెమెరాకు చిక్కారు. నలుగురు అబ్బాయిలు, ఓ చిన్నారి.. మొత్తం ఐదుగురూ కలిసి వైట్నర్ సేవిస్తుండటం ఈ వీడియోలో చూడవచ్చు. వీరి వయస్సు 10 సంవత్సరాలలోపే ఉంటుందని వీడియో చూస్తే అర్థమవుతోంది. చిన్నారుల ప్రవర్తనపై అనుమానంతో వాళ్లు ఏం చేస్తున్నారో కనుక్కునే ప్రయత్నం చేయగా.. తాము వైట్నర్ సేవిస్తున్నట్టు చిన్నారులే అమాయకంగా చెప్పడం చూస్తోంటే తెలిసీ తెలియని వయస్సులోనే బాల్యం మత్తులో తూగుతున్నట్టు స్పష్టమవుతోంది. 


వైట్నర్‌తో నషా ఎక్కుతోందంటూ.. నషాలోనే సమాధానం చెబుతున్న చిన్నారులు..
వైట్నర్ సేవించడం వల్ల ఏం జరుగుతుందని తిరిగి ప్రశ్నించగా.. నషా ఎక్కుతుందని చిన్నారులు చెప్పడం వీడియోలో రికార్డయింది. మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, గోషామహల్ ప్రాంతాల్లో వారికి ఈ మత్తు పదార్థం లభిస్తున్నట్టు చిన్నారులు వెల్లడించారు. విజయ్ నగర్ కాలనీలో పబ్లిగ్గానే ఇంత జరుగుతున్నా.. పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులకు ఈ దృశ్యాలు కంటపడటం లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 



ఇకనైనా స్థానిక హుమయున్ నగర్ పోలీసులు ఈ తరహా ఘటనలపై దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. లేదంటే నగరం బాల్యం మత్తుబాట పట్టడం ఖాయం అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఓవైపు కొంతమంది యువతీయువకులు డ్రగ్స్ బారినపడి (Hyderabad Rave Party) తమ జీవితాన్ని చిత్తు చేసుకుంటుండగా.. ఇప్పుడిలా పదేళ్ల ప్రాయంలోనే చిన్నారులు మత్తు పదార్థాల బారిన పడుతుండటం ప్రభుత్వాలకే కాదు.. సమాజానికి సైతం పెను సవాలుగా పరిణమిస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం ఏమని స్పందించనుందో వేచిచూడాల్సిందే మరి.


Also read : Drugs Case: డ్రగ్స్ దందాలో కేసీఆర్ సన్నిహితుల హస్తం... బండి సంజయ్ సంచలన ఆరోపణలు


Also read : MIM Leaders Shocking Misbehaviour: ఎంఐఎం నేతలకు చట్టాలు వర్తించవా.. ఎంఐఎం నేతల ఆగడాలపై స్పెషల్ స్టోరీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook