Bandi Sanjay: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాలు జోరుగా జనంలోకి వెళుతున్నాయి. సీఎం కేసీఆర్ బయటికి రాకున్నా.. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు జిల్లాలు చుట్టేస్తున్నారు. ఎక్కడికక్కడ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. గత మూడేళ్లుగా యాక్టివ్ గా లేని ఎమ్మెల్సీ కవిత సైతం జనంలోకి వెళుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. ఇక అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ దూకుడుగా వెళుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేశారు. బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు పొలోమని వచ్చేస్తున్నారు. పాలమూరు సభకు జేపీ నడ్డా రాగా.. సంజయ్ రెండో విడత పాదయాత్ర ముగింపు సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చారు. అటు కాంగ్రెస్ కూడా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వరంగల్ రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ వచ్చారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతలు.. సీఎం కేసీఆర్ ను, టీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతవరకు బాగానే ఉన్నా... ఇక్కడ కొన్ని విషయాలు ఆసక్తిగా మారాయి. అధికార పార్టీని టార్గెట్ చేస్తూనే పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి బీజేపీ, కాంగ్రెస్. దీంతో ఈ రెండు పార్టీల మధ్య రేస్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా నిలిచేందుకు పోటీ పడుతున్నట్లుగా ఉంది. ఇందుకోసం పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారని తెలుస్తోంది. తుక్కుగూడ సభలో అమిత్ షా, బండి సంజయ్ చేసిన ప్రసంగాలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. తెలంగాణకు చెందిన దివంగత నేతల పేర్లను ఉచ్చరించి అందరిని అశ్చర్యపరిచారు అమిత్ షా. తన ప్రసంగంలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావుకు ఆయన నివాళి అర్పించారు. ఆదివారం పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న బండి సంజయ్.. కాంగ్రెస్ నేత పీజేఆర్ నామస్మరణ చేశారు. పీజేఆర్ పేదల పక్షాల పోరాడిన మహా నేత అంటూ కొనియాడారు. అమిత్ షా, బండి సంజయ్ కామెంట్లు ఇప్పుడు చర్చగా మారాయి.


అయితే వ్యూహాత్మకంగానే బీజేపీ నేతలు.. కాంగ్రెస్ నేతల జపం చేస్తున్నారనే టాక్ వస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించాలంటే ముందు కాంగ్రెస్ ను వీక్ చేయాలనే భావనలో బీజేపీ హైకమాండ్ ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ బలహీనం అయితే.. ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు కమలం గూటికి చేరే అవకాశం ఉంది. నిజానికి కొంత కాలంగా కాంగ్రెస్ సీనియర్లు బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. కాని అది జరగలేదు. ఇందుకు కాంగ్రెస్ బలపడుతుందన్న  అభిప్రాయం రావడమేనని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరుస కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంటుందనే వాదన వస్తోంది. కాంగ్రెస్ బలపడితే తమకు ప్రమాదమని కమలం నేతలు కలవరపడుతున్నారట. అందుకే ముందు కాంగ్రెస్ ను వీక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.


సభల్లో టీఆర్ఎస్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నా.. అంతర్గతంగా మాత్రం కాంగ్రెస్ ను బలహీనపరిచే ప్రయత్నాలను బీజేపీ నేతలు చేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో గతంలో బలమైన నేతలుగా ఉన్న కాంగ్రెస్ నేతల జపం చేస్తున్నారని అంటున్నారు. దివంగత ప్రధాని పీవీకి బలమైన వర్గం ఉంది. ఇక హైదరాబాద్ పరిధిలో పీజేఆర్ కు లక్షలాది మంది అనుచరులు ఉన్నారు. అందుకే బీజేపీ నేతలు వీళ్లిద్దరి పేర్లను ప్రస్తావించారని అంటున్నారు.


READ ALSO: Amit Sha On Bandi Sanjay: బండి సంజయ్ ని ఆకాశానికెత్తిన అమిత్ షా.. సీఎం అభ్యర్థిగా సిగ్నల్ ఇచ్చినట్టేనా?


READ ALSO: Karate Kalyani: మరో వివాదంలో కరాటే కల్యాణి... ఆమెతో ప్రాణ భయం ఉందంటూ పోలీసులకు మరో వ్యక్తి ఫిర్యాదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook