చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేసిన సీనియర్ నేత మోత్కుపల్లిని టీడీపీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. దశాబ్దాల పాటు పార్టీకి విధేయుడిగా ఉన్న వ్యక్తి పార్టీ అధినాయకత్వంపై ఎందుకు ఆ స్థాయిలో విరుచుకుపడ్డారు..దారి తీసిన కారణాలు ఏంటి..ఎందుకు ఆయన్న పార్టీ నుంచి బహిష్కరించారనే రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి తిరుగుబాటు..ఆయనపై వేటుకు గల కారణాలను ఒక్కసారి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసంతృప్తి బీజాలు పడింది ఇక్కడే


2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మోత్కుపల్లి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి తరుణంలో ఆయన టీడీపీ నుంచి రాజ్యసభ పదవిని ఆశించారు. అయితే తాను కోరుకున్న రాజ్యసభ  సీటు దగ్గక పోవడంతో మోత్కుపల్లిలో అసంతృప్తి బీజాలు పడ్డాయి. అయినప్పటికీ ఓపిక వహించిన ఆయన తన ప్రయత్నాలు కొనసాగించారు. ఇదే సందర్భంలో బీజేపీకి టీడీపీ మిత్రపక్షంగా ఉండటంతో టీడీపీకి గవర్నర్ పదవి ఇస్తారని బలంగా  ఉహాగాహానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ పదవిపై ఆశపెట్టుకున్నారు మోత్కుపల్లి. అయితే ఇదే సమయంలో బీజేపీతో టీడీపీ బంధుత్వం తెగిపోవడంతో ఆయన ఆశల అడిఆశలయ్యాయి. ఊరిస్తూ వచ్చిన పదవులు చేజారడంతో మోత్కుపల్లి  కొంతకాలంగా అధినేతపై వ్యతిరేకత ప్రదర్శిస్తూవచ్చారు.


ప్రకంపనలు సృష్టించిన వ్యాఖ్యలు


 పార్టీ అధినేతపై వ్యతిరేకత కనబరుస్తూ వచ్చిన మోత్కుపల్లి ఒకానొక సందర్భంలో టీడీపీపై సంచనల ఆరోపణలు చేశారు.  తెలంగాణ టీడీపీ రోజురోజుకూ బలహీనపడుతోందని.. తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తే బాగుంటదనే సలహా ఇచ్చారు. జనవరిలో ఎన్టీఆర్‌ వర్ధంతి రోజున చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి ఈ వ్యాఖ్యలతో ఆగ్రహించిన టీడీపీ అధినేత ఆయనకు పార్టీ కార్యకలాపాల నుంచి దూరం పెడుతూ  వచ్చారు. పార్టీకి సంబంధించిన ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. దీంతో పార్టీలో మళ్లీ క్రియాశీలకం కావడానికి, అధినేతను కలిసి మాట్లాడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మోత్కుపల్లి పార్టీతో తెగతెంపులు చేసుకోవడానికి  నిర్ణయించుకున్నారు. దీంతొ తన సొంత నియోజకవర్గంతో పాటు తెలంగాణలోని తన అనుచరులతో సంప్రదింపులు జరిపారు.


మహానాడుకు అందని ఆహ్వానం


తాజా పరిణామాలను గమనించిన తెలంగాణ టీడీపీ నాయకత్వం మోత్కుపల్లిని  హైదరాబాద్‌లో మినీ మహానాడుకు ఆహ్వానించలేదు. దీనిపై ఆగ్రహించిన మోత్కుపల్లి  టీడీపీ అధినేత దళిత వ్యతిరేకి అని, చంద్రబాబు కంటే కేసీఆర్‌ ఎంతో  నయమమంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో తనను చంద్రబాబు పిలిచి మాట్లాడితే అన్ని సర్దుకుంటాయని.. కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ సిగ్నల్స్‌ ఇచ్చారు. అయితే దీనిపై చంద్రబాబు స్పందించలేదు. దీంతో పార్టీ అధినేతపై వ్యతిరేకత ఓ రేంజ్ లో పెంచుకున్నారు మోత్కుపల్లి.


చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు


మోత్కుపల్లి వైఖరిపై నమ్మకం సన్నిగిల్లి పార్టీ కార్యక్రమాలకు దూరంపెడుతూ వచ్చిన టీడీపీ అధిష్టానం విజయవాడలో నిర్వహిస్తున్న మహానాడుకు ఆయన్ను ఆహ్వానించలేదు. తనను మహానాడుకు ఆహ్వానించకపోవడంతో  మోత్కుపల్లి  ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో ఆయన టీడీపీ అధినేత పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు ద్రోహం చేశాడని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చి కలిసి పనిచేసినందుకు తనను క్షమించాలని వేడుకుంటూ రోదించారు. 


ఈ క్రమంలో మోత్కపల్లి వైఖరిని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ టీడీపీ కమిటీ మహానాడులోనే సమావేశమై రాజకీయ కుట్రతో చేస్తున్న ఆరోపణలను ఖండించింది. అనంతరం పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో టీడీపీలో మోత్కుపల్లి ప్రయాణానికి పుల్ స్టాప్ పడింది.