Sunitha Laxma Reddy House Attack: రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోందని.. ఇది ప్రజా పాలన కాదని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు జరుఉగుతుండడంతో గూండాల రాజ్యాన్ని గుర్తు చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణకు ఉన్న మంచి పేరును బిహార్‌లాగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌ ప్రోత్సాహంతో కాంగ్రెస్‌ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Family Cards: 'ఒక రాష్ట్రం-ఒక కార్డు' తెలంగాణ కొత్త ప్రయోగం.. రేషన్‌, హెల్త్‌ రెండూ ఒకటే


మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం గోమారం గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్‌ శ్రేణులు దాడి చేయడంతో సోమవారం ఆ ఇంటిని ఎమ్మెల్యే హరీశ్‌ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.


Also Read: HYDRAA Demolish: హైదరాబాద్‌ను కన్నీటిలో ముంచిన హైడ్రా కూల్చివేతలు


'ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు గూండా రాజ్యం నడుస్తుంది. ప్రజల హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. సిద్దిపేటలో క్యాంప్‌ ఆఫీస్‌, హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇల్లు, ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద దాడులను చూస్తుంటే రాష్ట్రంలో గుండు రాజ్యాన్ని తలపించేలా పరిపాలన సాగుతుంది. తెలంగాణకున్న మంచి పేరును మంటగలిపి ఈరోజు బీహార్‌లాగా తెలంగాణను మారుస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్సాహంతో జరిగిన దాడి. రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతిపక్షాల మీద దాడి చేసేలా ప్రోత్సహించినట్లు ఉన్నాయి' అని హరీశ్‌ రావు వివరించారు.


'కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. దేశంలో తెలంగాణ పోలీసులు అంటే మంచి పేరు ఉండేది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోలీసులను చెడగొడుతున్నారు. పోలీసు అధికారులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. పదేళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిందా?' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు గుర్తు చేశారు.


'జాతీయ మానవ హక్కుల కమిషన్‌, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల ఇంటిపై దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా వదిలిపెట్టం' అని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఇది ప్రజా పాలన కాదు గూండాల పాలన అని విమర్శించారు. 'మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటది. పోలీసులు ఇలాంటి దాడులను కట్టడి చేయడంలో విఫలమైతే రాయలసీమ లాంటి ఫ్యాక్షన్ పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది' అని ఆందోళన వ్యక్తం చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.