భర్త ఇంటి ఎదుట 42 రోజుల దీక్ష... ఆ మోసాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య...
Woman commits suicide in Huzurabad: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు... జీవితాంతం కలిసి ఉండాలనుకున్నారు... ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లయిన కొన్నాళ్లకే భర్త ప్లేటు ఫిరాయించాడు.
Woman commits suicide in Huzurabad: కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను మోసం చేశాడని తెలిసి బలవన్మరణానికి పాల్పడింది. అంతకుముందు, తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట 42 రోజుల పాటు దీక్ష చేసింది. బాధిత మహిళకు న్యాయం జరక్కపోగా.. చివరకు ఆమె ప్రాణాలు కోల్పోవడం పలువురిని కలచివేసింది.
వివరాల్లోకి వెళ్తే... కడప (Kadapa) జిల్లాకు చెందిన ఆవుల సుహాసిని (34)కి, హుజురాబాద్‌కి (Huzurabad) చెందిన సుజిత్‌కు కొన్నేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనుకున్నట్లు గానే నవంబర్ 25, 2020న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లు వీరి కాపురం సాఫీగానే సాగింది.
ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ సుజిత్ భార్యను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఓరోజు చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. భర్త ఎక్కడికి వెళ్లాడో తెలియక.. ఒంటరి జీవితాన్ని గడపలేక సుహాసిని మానసికంగా కుమిలిపోయింది. ఎలాగోలా భర్త ఆచూకీ తెలుసుకుని హుజురాబాద్‌లోని అతని ఇంటికి చేరుకుంది. భర్త, అత్తింటివారు తనను ఇంట్లోకి రానివ్వకపోవడంతో.. ఇంటి ఎదుటే నవంబర్ 26 నుంచి దీక్షకు దిగింది.
తనకు న్యాయం జరిగేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని తెగేసి చెప్పింది. దాదాపు 42 రోజులు గడిచినా భర్త, అత్తింటివారు ఆమెను చేరదీయలేదు. ఇంతలో ఆమెకు మరో షాకింగ్ విషయం తెలిసింది. భర్తకు వేరే మహిళతో వివాహం జరిగిందని... పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. దీంతో భర్త ఇంటి ఎదుటే బుధవారం (జనవరి 6) పురుగుల మందు తాగింది. స్థానిక పోలీసులు వెంటనే ఆమెను వరంగల్ ఎంజీఎంకు తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో మృతి చెందింది. తన చావుకు భర్త, అత్తింటివారే కారణమని సూసైడ్ నోట్‌లో (Suicide) సుహాసిని పేర్కొంది. సుహాసిని ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హుజురాబాద్ పోలీసులు వెల్లడించారు.
Also Read: Vanama Raghava : వనమా రాఘవ అరెస్టు వ్యవహారంలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి