Woman Kills Husband with Help of Lover in Rangareddy district: భార్య అక్రమ సంబంధం వల్ల ఓ భర్త హత్యకు గురి కావాల్సి వచ్చింది. వివాహేతర సంబంధం (Extramarital affair) మోజులో ఉన్న భార్య.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. తన భర్త అనారోగ్యంతో చనిపోయాడంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. కుటుంబీకులు అనుమానం వచ్చి.. పోలీసులు (Police) ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి స్టైల్‌లో విచారిస్తే అసలు విషయాలు బయటపడ్డాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ (Rangareddy District Shadnagar) నియోజకవర్గంలోని కొందుర్గు మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా (Prakasam District) పొదిలి మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన వేణు (Venu)… రూతమ్మ దంపతులు. వారిద్దరూ కొంతకాలం క్రితం కొందుర్గు మండల కేంద్రానికి వచ్చారు. అక్కడే ఉంటూ కూలి పనులతో పాటు మేస్త్రి పనులు చేసుకుని బతికేవారు. 


రూతమ్మకు (Rutamma) గతంలో పొరుగు గ్రామానికి చెందిన శ్రీనుతో వివాహేతర సంబంధం ఉండేది. విషయం తెలుసుకున్న ఆమె భర్త వేణు భార్యాపిల్లలను తీసుకొని కొందుర్గుకు వలస వచ్చాడు. అయినా కూడా ఈ అక్రమ సంబంధం కొనసాగుతూ వస్తోంది. దీంతో భార్యాభర్తల (Husband and wife) మధ్య గొడవలు మొదలయ్యాయి. 


అయితే భార్య రూతమ్మ ఎలా అయినా తన భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. అందుకోసం పక్కాగా ఓ ప్లాన్ వేసింది. అదును చూసి తన ప్రియుడు శ్రీనుతో (Srinu) కలిసి భర్తను అంతమొందించాలని డిసైడ్ అయ్యింది రూతమ్మ.


Also Read : Two killed in vizag road accident: బర్త్‌ డే పార్టీకి వెళ్లి ఇద్దరు సాఫ్ట్‌వేర్ల దుర్మరణం


రూతమ్మ తన ప్రియుడితో (Lover) కలిసి గత నెల 29 రాత్రి వేణు గొంతు నులిమి చంపేసింది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు తన భర్త అనారోగ్యంతో మృతి చెందాడంటూ పోలీసులకు (police) ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు ఫైల్ చేశారు. 


మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో వేణు గొంతు నులిమి వేసినట్లుగా గాయాలను కుటుంబసభ్యులు గుర్తించారు. తర్వాత కొందుర్గు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాద్‌నగర్‌ పోలీసుల (Shadnagar police) ఆధ్వర్యంలో కేసు విచారణ సాగింది. చివరకు రూతమ్మను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. తన ప్రియుడు శ్రీను కలిసి తానే తన భర్త వేణును హత్య (Murder) చేసినట్లుగా తాజాగా నేరం అంగీకరించింది రూతమ్మ. పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


Also Read : Tamilnadu Heavy Rains Alert: తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు, 15 జిల్లాల్లో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook