నాగార్జున రూ.4 కోట్లు ఇవ్వాలంటూ యువతి హల్‌చల్!
అక్కినేని ఇంటి ముందు అర్థరాత్రి యువతి హల్‌చల్
ప్రముఖ సినీ నటుడు నాగార్జున తనకు నాలుగు కోట్లు ఇవ్వాలంటూ ఓ యువతి హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద హల్‌చల్ చేసింది. ఆదిలాబాద్ కు చెందిన ఆ యువతి మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని నాగార్జున నివాసం వద్దకు వెళ్లింది. పీఏని కలిసి తాను నాగార్జునను కలవాలని అంది. పీఏ కారణం అడగగా.. నాగార్జున తనకు రూ.4కోట్లు ఇవ్వాలని అందుకే వచ్చినట్లు చెప్పింది. ప్రస్తుతం నాగార్జున నగరంలో లేరని ఎంత చెప్పినా ఆమె వినిపించుకోకుండా హడావిడి చేసింది. దీంతో భద్రతా సిబ్బంది ఆమెను పోలీసులకు అప్పగించారు. ఆమె మానసిక ఇబ్బందులతో బాధ పడుతున్నట్లు తెలుసుకొని బంధువులకు అప్పగించారు.