Ramdas Nayak: అధికారంలోకి వచ్చాక క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకులతోనే కాకుండా సాధారణ ప్రజలు, అధికారులపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. తాజాగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ రెచ్చిపోయారు. బూతులు మాట్లాడుతూ ఒకరిపై రెచ్చిపోయారు. 'బట్టలు విప్పదీసి కొడుతా' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అతడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KCR Bus Checkup: పొలంబాటలో కేసీఆర్‌కు ఈసీ షాక్‌.. బస్సు అణువణువు తనిఖీ


 


ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి కాలనీలో సెల్ టవర్ నిర్మాణంపై స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. సెల్‌ టవర్‌ నిర్వాహకులకు కలిసి వ్యతిరేకత వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. ఈ విషయమై ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌ దృష్టికి ఈ విషయాన్ని చెప్పారు. సెల్‌ టవర్‌ నిర్మాణాన్ని ఆపేయాలని ఎమ్మెల్యేను కోరారు. స్థానికుల ఫిర్యాదు విన్న అనంతరం ఎమ్మెల్యే సంబంధిత సెల్ టవర్ నిర్వాహకులకు ఫోన్ చేశారు. అతడు ఎమ్మెల్యే ఎవరో తెలియదు అని బదులివ్వడంతో రాందాస్‌ నాయక్‌ రెచ్చిపోయారు. 

Also Read: KTR Fire:కేకే, కడియం వంటి వాళ్లు మళ్లీ వచ్చి కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా తిరిగి రానివ్వం: కేటీఆర్‌


 


వెంటనే ఫోన్‌లోనే 'ఎమ్మెల్యే అంటే ఎవరో తెలియదా? బట్టలు విప్పదీసి కొడుతా.. నేనే  ఎమ్మెల్యే, నేనే మంత్రి, నేను ముఖ్యమంత్రి' అంటూ ఫోన్‌లో రెచ్చిపోయారు. ఇది చూస్తున్న ప్రజలంతా నివ్వెరపోయారు. కొందరు మహిళలు విని నోరెళ్లబెట్టారు.ఎమ్మెల్యే తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అండ చూసుకుని అతడి అనుచరులు కూడా రెచ్చిపోతున్నారని తెలుస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook