హైదరాబాద్: నేడు తాండూరు, వికారాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ తరపున పాల్గొన్నఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్... ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే, అసదుద్దీన్ ఓవైసీని తెలంగాణ నుంచి పారిపోయేలా చేస్తాం అని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. నిజాం నవాబును తెలంగాణ నుంచి తరిమికొట్టినట్టే ఓవైసీని సైతం తెలంగాణ నుంతి పారిపోయేలా చేస్తామని, అందుకు తానే హామీ అని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించినట్టుగా ఏఎన్ఐ ట్విటర్ ద్వారా వెల్లడించింది.  


ALSO READ : కేసీఆర్‌కి అసదుద్దీన్ ఓవైసీ అంటే భయం : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా