Young man kidnapped young woman with the help of 100 member in Adibatla: ప్రేమించిన యువతిని ఎత్తుకెళడానికి సినిమాలలో హీరో లేదా విలన్ 100 మందితో వస్తుంటారు. అడ్డొచ్చిన వారిని కొట్టి మరీ తీసుకెళుతుంటారు. సరిగ్గా అలంటి ఘటనే నిజంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఆదిభట్లలో ఓ యువతిని 100 మందితో (డీసీఎం, కార్లలో) వచ్చిన ఓ యువకుడు ఎత్తుకెళ్లాడు. యువతి ఇంటిపై దాడి చేసి.. అడ్డు వచ్చిన తల్లిదండ్రులను చితకబాది మరీ ఎత్తుకుపోయాడు. ఈ కిడ్నాప్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదిభట్లకు చెందిన ముచ్చర్ల దామోదర్ రెడ్డి, నిర్మల దంపతుల కూతురు వైశాలి డాక్టర్ చదవుతోంది. వైశాలిని మిస్టర్ టీ టైమ్ ఓనర్ నవీన్ రెడ్డి ప్రేమించాడు. ఈ విషయం వైశాలి తల్లిదండ్రులకు కూడా తెలుసు. అయితే వైశాలికి తల్లిదండ్రులు వేరే అబ్బాయితో పెళ్లి నిశ్చించారు. వైశాలి ఇంటిలో పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయి. పెళ్లికి చుట్టాలు కూడా వచ్చారు. దాంతో ఇల్లంతా సందడి సందడిగా ఉంది. ఈ సమయంలో వైశాలి ఇంట్లోకి నవీన్ సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చాడు. కిడ్నాప్ గ్యాంగ్ యువతి ఇంటిలోని వస్తువులను ధ్వంసం చేశారు. పక్కనే ఉన్న కార్లను కూడా పగలగొట్టారు.


వైశాలిని ఎత్తుకెళుతుండగా అడ్డువచ్చిన వారిపై నవీన్ రెడ్డి, అతడి అనుచరులు దాడికి తెగబడ్డారు. యువతిని పరహరిస్తున్న సమయంలో తల్లిదండ్రులు వారిని అడ్డుకున్నారు. కిడ్నాప్ గ్యాంగ్ వారిని కొట్టి యువతిని తీసుకెళ్లిపోయారు. యువతి తల్లిదండ్రులు గట్టిగా కేకలు వేయటంతో.. చుట్టుపక్కలవారు వచ్చి వారిని అడ్డుకునేందుకు యత్నించారు. వారిపై కూడా దాడి చేసి యువతిని ఇంటి నుంచి తీసుకెళ్లిపోయారు. అచ్చు సినిమా స్టైల్లో జరిగిన ఈ కిడ్నాప్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


ఈ కిడ్నాప్‌పై వైశాలి తల్లిదండ్రులు ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఏసీపీ ఉమామహేశ్వర రావు ఘటనా స్థలానికి చేరుకొని పరిచిలించారు. యువతి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. కిడ్నాప్ చేసింది మిస్టర్ టి టైమ్ ఓనర్ నవీన్ రెడ్డి అని యువతి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. దీంతో నవీన్ రెడ్డి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. పరిసరాల్లో ఉండే సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. వైశాలికి ఇష్టం ఉండే వెళ్లిందా? లేక బలవంతంగా తీసుకెళ్లారా? అనే విషయం తెలియాల్సి ఉంది.  


Also Read: Vivo Y35 5G: 15 వేల లోపు 5G స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!  
Also Read: Shani Transit 2023: జనవరి 17న 'పంచ మహాపురుష రాజయోగం'.. ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.