నిజామాబాద్: టిక్ టాక్ వీడియో తీయాలనే సరదాతో ప్రమాదపుటంచుల వరకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నా.. వాటి నుంచి యువత గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. తాజాగా నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం గొన్‌గొప్పుల గ్రామంలోని కప్పల వాగుచెక్ డ్యాం వద్ద కూడా అటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. సరదాగా వీడియోలు తీసుకోవడం కోసం వాగులోకి దిగిన ముగ్గురు యువకులు..ఆ వాగులోనే వరద ఉధృతికి కొట్టుకుపోయారు. 


యువకులు వాగులో కొట్టుకుపోవడం గమనించిన స్థానికులు చీరలు విసిరి గంగాజలం, మనోజ్ గౌడ్‌లను కాపాడారు. ఇంద్రపురి దినేష్ (22) అనే మరో యువకుడు వాగులోనే గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మరో నెల రోజుల్లో దుబాయ్ వెళ్లేందుకు దినేష్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు.