Youth commits suicide in Hyderabad: నెల రోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలి (Gachibowli) పరిధిలోని వట్టినాగులపల్లిలో ఓ యువతిపై హత్యాయత్నానికి (Murder attempt) పాల్పడిన ప్రేమోన్మాది ప్రేమ్ సింగ్ ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డాడు. జీడిమెట్ల పరిధిలోని అపురూప కాలనీలో ఉన్న తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. నవంబర్ 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమలో విఫలమవడం, యువతిపై హత్యాయత్నానికి పశ్చాత్తాపంతోనే ప్రేమ్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కూకట్‌పల్లిలోని (Kukatpally) ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ప్రేమ్ సింగ్ (22) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో గచ్చిబౌలి వట్టినాగులపల్లికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ప్రేమ్ సింగ్ ప్రేమను ఆ యువతి నిరాకరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 27న అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో ప్రేమ్ సింగ్ యువతి ఇంట్లోకి చొరబడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు.


యువతి గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు ప్రేమ్ సింగ్‌ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు (Hyderabad Police) అప్పగించారు. గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించగా... ఆమె కుటుంబ సభ్యుల దాడిలో ప్రేమ్ సింగ్ కాలు విరగడంతో అతన్ని కూడా పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రేమ్ సింగ్ పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు.


Also Read: Sirivennala: ఫిలిం ఛాంబర్‌కు చేరుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివ దేహం


అక్కడి నుంచి జీడిమెట్ల అపురూప కాలనీలోని ఇంటికి చేరుకున్న ప్రేమ్ సింగ్.. కొద్ది రోజులుగా తన గదికే పరిమితమయ్యాడు. భోజనానికి తప్ప తన గది నుంచి బయటకు రావడం లేదు. కుటుంబ సభ్యులెవరూ అతన్ని పట్టించుకోకపోవడంతో గదిలో ఒంటరిగా ఉండేవాడు. ఈ క్రమంలో నవంబర్ 28 ఉదయం కుటుంబ సభ్యులు అతని గది తలుపు తట్టగా అటు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. రాత్రి వరకూ గదిలో అలికిడి లేకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా... వెంటనే అక్కడికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టారు. గదిలో ప్రేమ్ సింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. ప్రేమ వైఫల్యం (Love failure), ఇటీవలి పరిణామాల కారణంగానే అతను ఆత్మహత్య (Hyderabad Crime) చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook