YS Sharmila comments on Sajjala Ramakrishna Reddy: తెలంగాణ, ఏపీలను ఉమ్మడి రాష్ట్రంగానే చూస్తామన్న సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. తెలంగాణపై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలను  తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించిన వైఎస్ షర్మిల.. సజ్జల వ్యాఖ్యలు అర్థరహితం అని కొట్టిపారేశారు. నేడు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం అనేది అందరికీ తెలిసిన ఒక వాస్తవంగా చెప్పుకొచ్చిన ఆమె.. ఎంతోమంది వీరుల బలిదానాలు, త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఏపీ.. ఈ రెండు రాష్ట్రాలు కలవడం ఇక అసాధ్యం అని వ్యాఖ్యానించిన వైఎస్ షర్మిల.. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయని.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవడం కూడా అటువంటిదే అని అన్నారు. విభజించిన రెండు రాష్ట్రాలను ఎలా కలుపుతారు, ఎందుకు కలుపుతారు అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డపై మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలపడం మీద కాకుండా మీ ప్రాంత అభివృద్ధి మీద మీరు ధ్యాస పెడితే బాగుంటుందని హితవు పలికారు. మీ హక్కుల కోసం పోరాటం చేసుకోండి. మీ ప్రాంతానికి న్యాయం చేయండి కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం తగదని వైఎస్ షర్మిల హెచ్చరించారు. 


మరోవైపు సజ్జల రామకృష్ణా రెడ్డిపై టిఆర్ఎస్ నేతలు సైతం మండిపడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ సాధన కోసమే ప్రాణాలు వదిలిన అమర వీరుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా సజ్జల ఎలా మాట్లాడుతారని మండిపడుతున్నారు. ఇదే అంశంపై టీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు మాట్లాడుతూ.. " ఎందరో ప్రజలు, అమర వీరుల త్యాగం, ఉద్యమనేత, తెలంగాణ జాతి పిత సీఎం కెసీఆర్ పోరాటంతో సాదించుకున్న తెలంగాణ వైపు చూస్తే మాడి మసి అవుతారు.. తస్మత్ జగ్రత్త " అంటూ మండిపడ్డారు. తెలంగాణ, ఏపీ కలుపుతాము అనే ఆలోచన వస్తేనే కళ్ళు పీకేస్తాం! మాట్లాడే నాలుకలు కోసేస్తాం అంటూ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఏపీ నేతలను హెచ్చరించారు. 


ఇది కూడా చదవండి : Sajjala Ramakrishna Reddy: రెండు రాష్ట్రాలు కలిసేందుకు పోరాటం చేస్తాం.. ఉమ్మడి రాష్ట్రమే మా విధానం: సజ్జల సంచలన వ్యాఖ్యలు


ఇది కూడా చదవండి : Pawan Kalyan's Varahi: పవన్ కళ్యాణ్ రంగుపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు జనసేన కౌంటర్


ఇది కూడా చదవండి : Mandous Cyclone: మాండస్ తుపాను, ఏపీ, తమిళనాడులో అతి భారీవర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook