YS Sharmila: పార్టీ నేతల రాజీనామాలపై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే..!
Telangana Elections 2023: వైఎస్సార్టీపీ పార్టీకి నాయకులు రాజీనామా చేయడంపై ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. కేసీఆర్‌ను గద్దె దించ అవకాశం వచ్చినందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. తనతో కలిసి నడిచిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఆలోచన చేయాలని రిక్వెస్ట్ చేశారు.
Telangana Elections 2023: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ వాగ్ధానాలు ఇచ్చి మోసం చేస్తున్నాడు కాబట్టే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా ఎన్నో నిరాహార దీక్షలు, ధర్నాలు చేశామన్నారు. 3800 కి.మీ పాదయాత్ర చేశామని.. ఇవన్నీ కేసీఆర్ నియంత పాలనను అంతం చేయడానికే చేశామని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్‌ని గద్దె దించే అవకాశం వచ్చిందని.. అది మనకు కాకుండా మరో పార్టీకి ఆ అవకాశం వచ్చిందన్నారు. అలాంటప్పుడు మనం ఆ పార్టీని బలోపేతం చేద్దామా..? లేక మనం పోటీకి దిగి ఓట్లు చీల్చి మళ్ళీ కేసీఆర్‌ను గద్దెనెక్కిద్ధమా..? ప్రశ్నించారు.
మనకు స్వార్ధ రాజకీయాలే ముఖ్యమా..? తెలంగాణ ప్రజల అభివృద్ధి ముఖ్యమా..? అని అడిగారు. ఇన్నాళ్లు తనతో కలిసి నడిచిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఆలోచన చేయాలని కోరారు. ప్రజల కోసం త్యాగం చేశాం తప్పా.. ఇది మోసం కాదన్నారు. మోసం చేయడం వైఎస్ఆర్ బిడ్డ షర్మిల రక్తంలో లేదని.. ఆ అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మన పోరాటం ఆగదని.. రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని తేల్చి చెప్పారు.
ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు. మనం రాజకీయాల్లో ఉన్నది పదవుల కోసం కాదని.. ప్రజల పక్షాన నిలబడటం కోసం అని అన్నారు. ఇది గ్రహించి తనతో ఉన్నవాళ్లే తన వాళ్లు తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరేవారని అన్నారు. మళ్ళీ చెబుతున్నానని.. తాను నిలబడతా.. మిమ్మల్ని నిలబెడతానని హామీ ఇచ్చారు.
కాగా.. మంగళవారం వైఎస్సార్టీపీ నేతలు ముకుమ్మడిగా రాజీనామాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంపై గట్టు రామచంద్రరావు నేతృత్వంలో నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన షర్మిల.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ పేరును షర్మిల చెడగొట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో నిలబెడతానని చివరగా.. అందరిని రోడ్డు మీద నిలబెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నో డ్రామాలు నడిపిందని.. కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని ఆరోపించారు. వీరి రాజీనామాల అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. తన నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.
Also Read: CM KCR: నీళ్ల కోసం ఏడ్చినం.. 58 ఏండ్ల దుర్మార్గాలకు కారణం కాంగ్రెస్: సీఎం కేసీఆర్ ఫైర్
Also Read: Yatra 2 Movie: యాత్ర-2లో సోనియా పాత్ర పోషించిన జర్మనీ నటి ఎవరంటే..? ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి