Ys Sharmila on Kcr: తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్‌ పార్టీయే టార్గెట్‌గా విమర్శలు సంధిస్తూ పాదయాత్ర సాగుతోంది. నేటితో మరో ప్రజా ప్రస్థాన యాత్ర 12 వందల కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈసందర్భంగా ఖమ్మం జిల్లా మధిర మండలం ఆత్కూరులో వైఎస్‌ఆర్‌ విగ్రహ ఏర్పాటు కార్యక్రమం చేపట్టారు. ఐతే విగ్రహ ఆవిష్కరణను టీఆర్‌ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈసందర్భంగా సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్‌ షర్మిల మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌ విగ్రహంపై చేయి వేస్తే..ఊరుకోబోమని టీఆర్ఎస్‌ నేతలను హెచ్చరించారు.  వైఎస్ఆర్ విగ్రహాన్ని ముట్టుకుంటే టీఆర్ఎస్‌కు ప్రజలే బుద్ధి చెబుతున్నారన్నారు. కేసీఆర్‌ది దెయ్యం పాలన..వైఎస్ఆర్‌ది దేవుని పాలన అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు శిక్ష తప్పదన్నారు. పోలీసుల అనుమతితోనే విగ్రహాన్ని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.


పోలీసుల అనుమతి ఉన్నా టీఆర్ఎస్‌ నేతలు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు వంత పాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నా..ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మళ్లీ ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే వైఎస్‌ఆర్ అభిమానులు ఊరుకోరని..టీఆర్ఎస్‌ నేతలను తరిమి తరిమి కొడతారని మండిపడ్డారు వైఎస్ షర్మిల.


Also read:Ktr Comments: కుల, మత పిచ్చొళ్లను తరిమేద్దాం.. రేవంత్, సంజయ్ పై కేటీఆర్ ఫైర్  


 


Also read:Southwest Monsoon: దేశంలో విస్తరిస్తున్న నైరుతి రుతు పవనాలు..త్వరలో భారీ వర్షాలు..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి