Ys Sharmila Twit: ఏపీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సెగలను రేపుతోంది. దీనిపై ఇరు ప్రాంతాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనిపై మంత్రి కేటీఆర్ సైతం స్పందించినా..అడ్డుకట్ట పడటం లేదు. తన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఐనా కౌంటర్ ఎటాక్‌లు ఆగడం లేదు. ఏపీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రులు, వైసీపీ నేతలు ఖండిస్తుంటే..ప్రతిపక్షాలు మాత్రం సపోర్ట్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులనే మంత్రి కేటీఆర్ వివరించారని చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటు తెలంగాణలో కూడా ఆ మాటలు నిప్పును రాజేశాయి. పక్క రాష్ట్రం గురించి ఆలోచించే ముందు ఇక్కడ పరిస్థితులను కేటీఆర్ తెలుసుకోవాలని విపక్షాలు కౌంటర్లు ఇస్తున్నాయి. తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న వారి గురించి కేటీఆర్ మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నాయి. కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారని మండిపడుతున్నాయి. త్వరలో ప్రజా ప్రభుత్వం వస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి.



తాజాగా మంత్రి కేటీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తనదైన శైలిలో విమర్శలు సంధించారు. ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌కు దోస్తులంతా మేఘా కృష్ణారెడ్డి, ఫీనిక్స్ సురేష్ లాంటి ఆంద్రా ధనవంతులే కదా అని ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఉద్యమకారులు, రైతులు, కౌలు రైతులు, నిరుద్యోగులు, ఆదివాసీలు, దళితులు, పేదలతో కేటీఆర్ స్నేహం చేసి ఉంటే వారి కష్టం తెలిసేదన్నారు. 


గతకొంతకాలంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై వైఎస్ షర్మిల విమర్శలను ఎక్కిపెడుతున్నారు. రెండో దఫా పాదయాత్రలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. అడుగడుగునా ప్రజల సమస్య తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి మండలంలో రైతు గోస పేరుతో కౌలు రైతులతో సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈసందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.