YS Sharmila on CM KCR: తెలంగాణలో రుణమాఫీ హామీపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రైతు రుణమాఫీపై దొర గారిది పూటకో మాట.. రోజుకో వేషం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నమ్మి ఓటేస్తే పథకానికే  పంగనామాలు పెట్టి.. రైతులకు ఎగనామం పెట్టిన మోసగాడు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. లక్ష మాఫీకి 4 ఏళ్లుగా లక్ష మాటలు చెప్పిండే తప్ప.. లక్ష్యం మాత్రం నెరవేర్చలేదన్నారు. మాట తప్పం, మడమ తిప్పం.. ఆరు నూరైనా, నూరు ఆరైనా, మాట ఇస్తే తల నరుక్కుంటం అంటూ రుణమాఫీపై చేసిన వాగ్దానాలు దొర గడప దాటలేదని విమర్శించారు. ఈ మేరకు షర్మిల ట్వీట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైతులకు రుణాలు మాఫీ కాలేదని.. కేసీఆర్ బూటకపు హామీని నమ్మి ఓటేసిన పాపానికి రైతన్న బ్యాంకుల దగ్గర దోషిలా నిలబడ్డాడని అన్నారు. నోటీసుల మీద నోటీసులు అందుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే అన్నం పెట్టే రైతన్నకు "డీ ఫాల్టర్" అనే ముద్ర వేసిన పాపం ద్రోహి కేసీఆర్‌కే దక్కిందన్నారు. రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు రైతుల  ఇళ్ల మీద పడుతున్నారని అన్నారు. రైతు బంధు పైసలను వడ్డీల కింద జమ చేసుకుంటున్నారని.. 20 లక్షల అకౌంట్లను ఫ్రీజ్ చేశారని పేర్కొన్నారు. 


అన్నదాతలు రోడ్ల మీద పడి రైతులు ఆందోళనలు చేస్తున్నా కేసీఆర్‌కు కనీసం చీమ కుట్టినట్లు లేదని షర్మిల ఫైర్ అయ్యారు. కరోనా పేరు చెప్పి రైతులకు చెల్లించాల్సిన 6 వేల కోట్లకే 60 కష్టాలు చెప్పే దొరలకు.. కాళేశ్వరం కట్టడానికి లక్ష కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. అప్పు తెచ్చిన 5 లక్షల కోట్లు ఎక్కడ పోయాయని నిలదీశారు. విలాసాలకు, కొత్త భవనాలకు వందల కోట్లు ఎక్కడవి అని అడిగారు.


35 వేల ఎకరాలు అమ్మిన సొమ్ము ఎక్కడ పెట్టారని ఆమె అన్నారు. కరోనా కష్టకాలమే అయితే బీఆర్ఎస్ అకౌంట్‌లో 1200 కోట్లు ఎలా వచ్చాయన్నారు. పథకాలకు నిధులు ఉండవు కానీ.. దేశ రాజకీయాలకు ఫండింగ్ చేసేంత సొమ్ము కేసీఆర్ దగ్గర ఉంటుందన్నారు. దీన్నే అంటారు బంగారు తెలంగాణ అంటూ సెటైర్లు వేశారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజుకోవడమే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని విమర్శించారు. మాట మీద నిలబడే దమ్ము కేసీఆర్‌కు ఉంటే.. తక్షణం 31 లక్షల మంది రైతులకు లక్ష లోపు రుణాలు మాఫీ చేయాలని వైఎస్సార్టీపీ డిమాండ్ చేస్తోందన్నారు. 


Also Read: Red Light In Smart Meter: విద్యుత్ మీటర్‌లో రెడ్ లైట్ గురించి తెలుసా..! నెలకు ఎంత చెల్లించాలంటే..?  


Also Read: Interesting Facts: ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఇదే..! జనాభా ఎంతంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి