YS Sharmila In Independence Day Celebrations: అమరవీరుల ప్రాణ త్యాగాలతో వచ్చిన ప్రత్యేక రాష్ట్రంలో మహిళలకు గౌరవమే లేదని వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎక్కడ చూసినా వైన్ షాపులు, బార్లు, పబ్బులు.. తెలంగాణలో పట్ట పగలు కూడా మహిళలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం రాకముందు కంటే ఈరోజు మద్యం అమ్మకాలు పదింతలు పెరిగాయని అన్నారు. మద్యం అమ్ముకొని కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ వైఖరి భిన్నత్వంలో ఏకత్వంలా లేదన్నారు. విభజించు పాలించు అనే విధంగా కేంద్రంలో పాలన ఉందన్నారు. మణిపూర్‌లో ఘటన బాధాకరమని.. ప్రజలు మధ్య గొడవలు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లా ఆర్డర్ పూర్తిగా విఫలమైందని.. మతం పేరుతో రాజకీయాలు బీజేపీ మానుకోవాలని హితవు పలికారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టె రాజకీయాలు బంద్ చేయాలని డిమాండ్ చేశారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.


రాష్ట్రంలో మగ, ఆడ పిల్లల తల్లిదండ్రులు చాలా ఆందోళనగా ఉన్నారని షర్మిల అన్నారు. 38 వేల ఎకరాలు భూములు కేసీఆర్ అమ్మాడని.. మద్యం అమ్మకాలతో రాష్ట్రంను నడుపుతున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలు అమలు చేయలేదని.. రుణమాఫీ కాని వాళ్ళు ఇంకా ఉన్నారన్నారని అన్నారు. 30 లక్షల మందికి రాష్ట్రంలో ఇల్లు లేవని.. డబుల్ బెడ్ రూమ్‌లు ఇవ్వలేదని అన్నారు. బ్రిటిష్ వారికి, కేసీఆర్‌కు తేడా లేదు.. ఇద్దరు ఒక్కటే.. నియంత పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


"4 లక్షల కోట్ల అప్పు తెచ్చి రాష్ట్రాన్ని నడిపితే పాలన అంటారా..? దిక్కుమాలిన పాలన అంటారా..? లక్షల కోట్ల అప్పు తెచ్చినా ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ఆనాడు బ్రిటిష్ తెల్ల దొరలు దేశాన్ని పాలించి దోచుకుంటే.. ఈరోజు తెలంగాణలో మన నల్ల దొర కేసీఆర్ కూడా వాళ్లలాగే పరిపాలిస్తున్నారు. కేసీఆర్ నియంత పాలన పోతేనే తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు.." అని షర్మిల అన్నారు.


Also Read: Independence Day Celebrations: అన్ని సేవలు ఇంటి వద్దకే.. గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చాం: సీఎం జగన్   


Also Read: Wanindu Hasaranga: స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా సంచలన నిర్ణయం.. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌ బై..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి