YS Sharmila Letter To PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయనకు బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన లక్ష కోట్ల అవినీతిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో జరిగిన కుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. వెంటనే ఒక విచారణ కమీషన్‌ను నియమించి.. నిజ నిజాలు దేశ ప్రజల ముందు ఉంచాలని కోరారు. కేసీఆర్ తెలంగాణను సొంత ఎస్టేట్ అనుకుంటున్నారని విమర్శించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కాళేశ్వరం దేశంలోనే అతి పెద్ద కుంభకోణం. రూ.97,500 కోట్లు సెంట్రల్ ఫైనాన్స్ సంస్థల నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అప్పు తెచ్చారు. కేంద్ర ప్రభుత్వంగా మీరు కాపలా కుక్కలా ఉండాలి కాదా..! కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఒక ఏటీఎంలా వాడుకుంటున్నారని మీరే అంటున్నారు. అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? తెలంగాణ లో జరిగిన అతి పెద్ద కుంభకోణంపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. విచారణకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం..' అని షర్మిల లేఖలో ప్రస్తావించారు.


కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ఒక అద్బుతమని మోసం చేశారని షర్మిల విమర్శించారు. 18 లక్షల వరకు నీళ్లు ఇస్తామని చెప్పి.. కేవలం 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని ఆరోపించారు. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్ట్‌ను వైఎస్సార్ రూ.38 వేల కోట్లతో పూర్తి చేద్దాం అనుకున్నారని.. రీ డిజైన్ చేసి రూ.లక్షా 20 వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు. 


'నా తలకాయ..నా చెమట అని కేసీఆర్ ఎక్కడా లేని సొల్లు చెప్పారు. గోదావరి నదిపై కాళేశ్వరం అనే సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. కట్టిన మూడేళ్లలో మునిగిపోయిన ప్రాజెక్ట్ ప్రపంచంలో ఒక్కటే ఉంటుంది. కేసీఆర్ సర్కార్ మీద దర్యాప్తు చేయాలి. టెండరింగ్ దగ్గర నుంచి మొత్తం అక్రమాలు జరిగాయి. ఒక దర్యాప్తు కమీషన్ వేసి వెంటనే నిజాలు నిగ్గు తేల్చండి. తెలంగాణకు కేసీఅర్ ద్రోహం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఉండి కూడా ఏమీ మాట్లాడటం లేదు
రాహుల్ వచ్చాడు..అవినీతి జరిగిందన్నాడు.. మరి పోరాటం ఎందుకు చేయడం లేదు.. ప్రతిపక్షాలకు దమ్ముంటే.. మాతో కలిసి పోరాటం చేయండి..' అని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. 


ప్రధాని మోదీ వస్తున్నారని పిల్లిలా దాక్కుని తిరుగుతున్నారని ఆమె విమర్శించారు. ప్రజల డబ్బుతో ఇప్పుడు బందీ పోట్ల రాష్ట్ర సమితి పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. డొక్కు స్కూటర్‌లో తిరిగే కేసీఆర్ .. విమానాలుకొనే స్థాయికి ఎలా ఎదిగారన ప్రశ్నించారు. మోదీ రాష్ట్రానికి వస్తే.. అవినీతిపై అడుగుతారని కేసీఆర్‌కి భయమన్నారు. ఆయన ఒక అహంకారి.. నియంత అని అందుకే మొహం చాటేస్తున్నారని మండిపడ్డారు. 


Also Read: Yashoda Movie Review : యశోద రివ్యూ.. సమంత.. మోసింది భారమంతా


Also Read: Virat Kohli: కలను సాధించలేకపోయాం.. టీమిండియా ఓటమిపై విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook