Zee Telugu Digital Tv: జీ తెలుగు న్యూస్ డిజిటల్ ప్రారంభం.. తెలుగు ప్రజలకు ఎంతో ఉపయోగమన్న ఎంపీ బండి సంజయ్
Zee Telugu Digital Tv: జీ తెలుగు న్యూస్ డిజిటల్ ఛానెల్ అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్ లో జరిగిన ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు.
Zee Telugu Digital Tv: భారతదేశపు అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్‌లో జీ మీడియా (Zee Media) ఒకటి. దేశంలోనే తొలిసారిగా ఒకేసారి నాలుగు దక్షిణాది భాషల్లో జీ మీడియా డిజిటల్ టీవీ (Zee Digital Tv) ప్రసారాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. . హైదరాబాద్ లో జరిగిన ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈ ఈవెంట్ లో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ (BJP MP Bandi Sanjay) మాట్లాడుతూ.. న్యూస్ నిక్కచ్చిగా వాస్తవాలను తెలియచేసే విధంగా ఉండాలని ఆయన అన్నారు. దేశభక్తిని, జాతీయ భావాలను ప్రజల్లో తీసుకెళ్లడంలో జీ మీడియా కీలకపాత్ర పోషించందని ఆయన అన్నారు. ఈ ఛానెల్ ప్రారంభించడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని బండి సంజయ్ పేర్కొన్నారు.
జీ ప్రస్థానం:
జీ గ్రూప్ (Zee Media Group) అంటే ఓ నమ్మకం. ఓ బ్రాండ్. వార్తల్ని ఎప్పటికప్పుడు నిక్కచ్చిగా అందించమే తెలుసు. దేశంలోనే తొలి ప్రైవేట్ శాటిలైట్ చానెల్‌గా రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి ప్రారంభమైన జీ మీడియా ప్రస్థానం ముందుకు సాగుతూనే ఉంది. దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ ఉన్నది జీ మీడియాకు మాత్రమే. ఇక సోషల్ మీడియా పరంగా చూస్తే 15.4 కోట్ల మంది ఫాలోవర్లు కలిగిన అతిపెద్ద నెట్‌వర్క్ ఇది. విస్తృతమైన నెట్‌వర్క్, సమర్ధవంతమైన టీమ్ కలిగి ఉండటమే జీ మీడియా బలంగా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook