ED Raids: చికోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలు..!

Wed, 27 Jul 2022-5:38 pm,

ED Raids: ఐఎస్ సదన్‌లోని చికోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. గతంలో గుడివాడ కెసినో కేసులో ఆరోపణలు ఎదురుకున్నాడు ప్రవీణ్. బోయినపల్లిలో మాధవరెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. జూన్ 10,11,12,13 తేదీలలో నేపాల్‌లోని హోటల్ మేచీ క్రౌన్‌లో మాధవ రెడ్డి కేసీనో నిర్శహించినట్లు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానాల ద్వారా పేకాట రాయుళ్ళను నేపాల్‌కు తరలించి.. ఇండో నేపాల్ సరిహద్దు సిలిగురిలో క్యాసినో శిబిరాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. నేపాల్ , ఇండోనేషియా పుకేత్‌లో క్యాసినోలు నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. క్యాసినోలలో టాలివుడ్, బాలీవుడ్, నేపాలీ డ్యాన్సర్లతో మస్తీ చేసినట్లు తెలుస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link