Kanipakam Vinayaka Swamy: కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో లక్ష్మీగణపతి హవన ప్రత్యేక పూజలు!

Sat, 04 Mar 2023-1:05 pm,

Kanipakam Vinayaka Swamy: కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో  ఆగమోక్తంగా లక్షమోదక లక్ష్మీగణపతి హవనం నిర్వహించారు. విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద్రేంద్ర సరస్వతి, పీఠం ఉత్తరాధికారి  స్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యాగశాలలో గణపతి పూజ, కలశస్థాపన యంత్ర స్థాపన చేసి మోదకం హవనం చేశారు. యాగమూర్తికి మహా నివేదన సమర్పించి లఘు పూర్ణాహుతి చేపట్టారు. సాయంత్రం ఆలయ పవిత్ర పుష్కరిణిలో కొలువుదీరిన వినాయకునికి ప్రత్యేక హారతులు సమర్పించారు.


 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link