PV Sindhu: దూసుకెళ్తున్న తెలుగు తేజం..పీవీ సింధు ఖాతాలోకి సింగపూర్ ఓపెన్ టైటిల్..!
PV Sindhu: తెలుగు తేజం, ఒలింపిక్స్ పతకాల విజేత పీవీ సింధు సరికొత్త చరిత్రను సృష్టించింది. సింగపూర్ ఓపెన్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి వాంగ్ జి యినిపై ఘన విజయం సాధించింది. దీంతో కెరీర్లోనే తొలి సూపర్ 500 టైటిల్‌ను గెలుచుకుంది. మొత్తంగా 21-9,11-21,21-15 తేడాతో వాంగ్‌పై విజయ ఢంకా మోగించింది. ఈఏడాదిలో పీవీ సింధు సూపర్ ఫామ్‌లో ఉంది. ఇప్పటికే సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టైటిళ్లను సొంతం చేసుకుంది.