Philippines Typhoon: ఫిలిప్పీన్స్‌లో `రాయ్`’ తుపాను బీభత్సం.. 23 మంది మృతి..
Philippines Typhoon: ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి 23 మంది మృతి చెందారు.
Philippines Typhoon: ఫిలిప్పీన్స్(Philippines)లో ‘'రాయ్'’ తుపాను(Rai Typhoon) విధ్వంసం సృష్టించింది. తుపాను ధాటికి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచార, రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది.
3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. రాయ్ తుపాను కారణంగా గంటకు 195-270 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. గాలుల ధాటికి భారీ వృక్షాలు నెలకొరిగాయని, చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి.
Also Read: Fire accident in Japan: జపాన్ ఒసాకాలో భారీ అగ్నిప్రమాదం-27 మంది మృతి
తుపాను బీభత్సానికి తమ రాష్ట్రం పూర్తిగా నేలమట్టమైందని డినాగాట్ ఐలాడ్స్ ప్రావిన్స్ గవర్నర్ బగావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆహారం, మంచినీళ్లు, తాత్కాలిక షెడ్లు, పరిశుభ్రత కిట్లు, మందులు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దక్షిణ, కేంద్ర ఫిలిప్పీన్స్‌లోని రాష్ట్రాలను అతలాకుతలం చేసిన రాయ్ తుపాను శుక్రవారం రాత్రి తీరం దాటి దక్షిణ చైనా సముద్రం(South China Sea) వైపు కదిలిందని అధికారులు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook