Iran Protest: ఇరాన్ లో హిజాబ్ అంశంపై భగ్గుమన్న నిరసనలు.. ఘర్షణల్లో 31 మంది మృత్యువాత!
Iran Protest: ఇరాన్ లో హిజాబ్ అంశంపై నిరసనలు భగ్గమంటున్నాయి. ఆందోళకారులకు, భద్రతాదళాలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
Iran Protest: హిజాబ్ అంశంపై ఇరాన్ దేశం అట్టుడుకుతుంది. ఆ దేశంలో హిజాబ్ వ్యతిరేక నిరసనలు రోజురోజూకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతాదళాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ ఘర్షణల్లో గత ఆరు రోజుల్లో దేశంలో 31 మంది చనిపోయినట్లు సమాచారం. మృతుల్లో పలువురు భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిరసనలకు సంబంధించిన సమాచారం ఎక్కువ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇరాన్ ప్రభుత్వం ఇన్‌స్టాగ్రామ్ సేవలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సైట్లపైన అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
హిజాబ్ సరిగా ధరించలేదన్న కారణంతో ఇరాన్ లో మహ్సా అమిని అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గతవారం పోలీసు కస్టడీలో ఆమె మృతి చెందింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. రాజధాని టెహ్రాన్ తో సహా 30కిపైగా నగరాల్లో మహిళలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అంతేకాకుండా హిజాబ్ లను కాల్చివేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రభుత్వ బలగాలు కాల్పులకు సైతం దిగాయి. ఇప్పటివరకు చెలరేగిన హింసలో కుర్దిస్తాన్ ప్రావిన్స్ లో అత్యధికంగా 15 మంది మరణించగా.. మెుత్తంగా దేశవ్యాప్తంగా 31 మంది చనిపోయినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook