Nepal Bus Accident: పండుగ పూట విషాదం..లోయలో పడిపోయిన బస్సు.. 32 మంది మృతి!
Nepal Bus Accident: నేపాల్‌లోని ముగు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 32 మంది మృతి చెందగా..15మందికి గాయాలయ్యాయి
Nepal Bus Accident: నేపాల్‌లోని ముగు జిల్లా(Mugu district)లో ఘోర బస్సు ప్రమాదం(bus accident ) జరిగింది. నేపాల్ గంజ్ నుంచి ముగు జిల్లా కేంద్రం గంగఢీ వైపు వెళ్తున్న బస్సు పినా ఝ్యారీ నదిలో పడింది. ఈ ఘటనలో మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. విజయ దశమి పండుగ కోసం.. ప్రయాణికులంతా వేర్వేరు ప్రాంతాల నుంచి తమ ఇళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలం నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు సైన్యం రంగంలోకి దిగింది.
మారుమూల ముగు ప్రాంతంలో బస్సు ముందు టైర్లలో ఒకదానికి పంక్చర్ అయినట్లు జిల్లా అధికారి రోమ్ బహదూర్ మహత్ చెప్పారు. బస్సు దక్షిణ బాంకే జిల్లా(southern Banke district) నుండి ముగు ప్రాంతానికి వెళ్తోంది. హిందూ పండుగ దశైన్ పండుగ(Hindu festival of Dashain)ను జరుపుకోవడానికి చాలా మంది ప్రయాణిస్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో కనీసం 45 మంది ప్రయాణిస్తున్నట్లు భావిస్తున్నారు.
Also read: China: చైనాలో భారీ వరదలు..15 మంది మృతి..780 మిలియన్ డాలర్ల నష్టం!
గాయపడినవారిని చికిత్స కోసం హెలికాప్టర్లు ద్వారా ఆసుపత్రులకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రమాద స్థలంలో ప్రాణాలతో బటపడ్డవారిని, బాధితుల కోసం పోలీసులు స్థానికుల సహాయంతో వెతుకుతూనే ఉన్నారు. కొండ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు తరుచుతున్న అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఇదిలావుంటే, ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019 లో నేపాల్‌లో దాదాపు 13,000 రోడ్డు ప్రమాదాల్లో(Road Accidents) 2,500 మందికి పైగా మరణించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook