Bangladesh Ferry Fire: నౌకలో భారీ అగ్నిప్రమాదం... 37 మంది సజీవ దహనం!
Bangladesh: బంగ్లాదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నదిలో ప్రయాణిస్తున్న ఓ నౌకలో అగ్నిప్రమాదం సంభవించి... 37 మంది మృతి చెందారు.
Bangladesh Ferry Fire: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో నదిలో వెళ్తున్న ఓ నౌకలో (Ferry Fire Accident) మంటలు చెలరేగి...37 మంది సజీవదహనమయ్యారు. 100మందికిపైగా గాయపడ్డారు. రాజధాని ఢాకా (Dhaka)కు దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝాలాకాతి (Jhalokathi) సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ఢాకా నుంచి బయల్దేరిన ఎంవీ అభిజాన్-10 నౌక ఇంజన్ గదిలో శుక్రవారం ఉదయం 3:30 గంటలకు మంటలు చెలరేగి ఈ ప్రమాదం (Fire Accident) సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఝాలాకాతి ప్రాంతంలోని సుగంధ నదిలో నౌక నుంచి 37 మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. భయభ్రాంతులకు గురైన కొందరు ప్రయాణికులు నదిలోకి దూకారు. ఈ ప్రమాదంలో సుమారు 100 మంది గాయపడగా..వారిందరినీ బారిసాల్‌లోని ఆసుపత్రులకు పంపి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఏడాది ఆగస్ట్‌లో ప్రయాణికులతో వెళ్తున్న పడవ, ఇసుకతో కూడిన కార్గో షిప్ (Cargo Ship) ఢీకొనడంతో కనీసం 21 మంది చనిపోయారు. ఏప్రిల్, మే నెలల్లో రెండు వేర్వేరు ప్రమాదాల్లో 54 మంది చనిపోయారు. గత ఏడాది జూన్‌లో, ఢాకాలో ఒక ఫెర్రీని వెనుక నుండి మరొక ఫెర్రీ ఢీకొనడంతో కనీసం 32 మంది దుర్మరణం చెందారు. ఫిబ్రవరి 2015లో రద్దీగా ఉండే ఓడ.. కార్గో నౌకను ఢీకొనడంతో (ship collided with a cargo vessel) కనీసం 78 మంది మరణించారు.
గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్ లో అగ్నిప్రమాద ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. జూలైలో పారిశ్రామిక పట్టణమైన రూపగంజ్ ( Rupganj) లోని ఆహార మరియు పానీయాల ఫ్యాక్టరీలో జరిగిన మంటల్లో 52 మంది సజీవదహనమయ్యారు.. ఫిబ్రవరి 2019లో రసాయనాలను అక్రమంగా నిల్వ ఉంచిన ఢాకా అపార్ట్‌మెంట్లలో మంటలు చెలరేగడంతో కనీసం 70 మంది మృత్యువాతపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి