South Africa Bus Accident News: దక్షిణాఫ్రికాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బోట్స్‌వానా నుంచి మోరియా వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి అదుపు తప్పి లోయలో పండింది. ఈ ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈస్టర్ పండుగ కోసం జియాన్ చర్చికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లోయలో పడిన సమయంలో మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో 8 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడగా.. ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సులో 46 మంది ప్రయాణికులు ఉండగా.. బాలిక మాత్రమే సేఫ్‌గా బయటపడింది. చనిపోయిన వారిలో కొంతమంది మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకోవడంతో వెలికి తీయడం కష్టంగా మారుతోంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోయి.. వంతెనపై డివైడర్లను ఢీకొట్టడంతో లోయలోకి పడిపోయినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో అక్కడ మంటలు అంటుకుని బస్సు దగ్ధమైందని వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఘటనా స్థలానికి వెళ్లిన రవాణా శాఖ మంత్రి సింధిసివే చికుంగా చేరుకున్నారు. బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి విచారణ జరుపుతుందని చెప్పారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. ఈస్టర్ వారాంతంలో ఎక్కువ మంది ప్రజలు రోడ్లపైకి ప్రయాణిస్తున్నారని.. డ్రైవింగ్‌ను చాలా అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని తాము కోరుతూనే ఉన్నామని చెప్పారు. 


అంతకుముందు ఈస్టర్ సందేశంలో ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ.. సురక్షితమైన ఈస్టర్‌గా మార్చడానికి ప్రజలు తమ వంతు కృషి చేయాలని కోరారు. మన రోడ్లపై విషాదాలు లేదా గాయాలకు సంబంధించిన గణాంకాలను చూసేందుకు వేచి ఉండే సమయం కాకూడదని అన్నారు. ఈస్టర్ వారంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త వహించాలని కోరారు. ఆయన ఈ మాటలు చెప్పిన కొన్ని గంటలకే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న సిరిల్.. బాధిత కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. జోహన్నెస్‌బర్గ్‌కు ఉత్తరాన 300 కి.మీ దూరంలో ఉన్న లింపోపో ప్రావిన్స్‌లోని మమట్లకాల సమీపంలో రెండు కొండలను కలిపే వంతెనపై నుంచి బస్సు పడిపోయింది.


Also Read:  Redmi Note 13 5G Price: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్స్‌..Redmi Note 13 5G మొబైల్‌ను రూ.800కే పొందండి!   


Also Read:  RR vs DC Live: పరాగ్‌ విధ్వంసంతో రాజస్థాన్ అ'ద్వితీయ' విజయం.. ఢిల్లీకి తప్పని నిరాశ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook